కరోనా కారణంగా ఆగిపోయిన వకీల్ సాబ్ సినిమా షూట్ మళ్లీ మొత్తానికి ఈ రోజు ప్రారంభమైంది. నగర శివార్లలోని సరూర్ నగర్ లో వున్న విక్టోరియో మెమోరియల్ హోమ్ లో వకీల్ సాబ్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు గత ఆరు నెలలుగా కనిపిస్తున్న గెటప్ తోనే ఈ రోజు కూడా షూటింగ్ కు హాజరయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రోజు పవన్ తన గుబురు గెడ్డం తీసేస్తారని టాక్ వినిపించింది. కానీ గెడ్డం పూర్తిగా తీయకుండా, వకీల్ సాబ్ స్టార్ట్ అయినపుడు ఏ గెటప్ తో, ఏ మేరకు గెడ్డంతో వున్నారో అలాగే వచ్చినట్లు తెలుస్తోంది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఓ ఇరవై రోజుల పాటు వర్క్ చేయాల్సి వుంది. అది అయిపోతే సినిమా షూట్ పార్ట్ అయిపోయినట్లే. పింక్ మూవీ ఆధారంగా రీమేక్ చేస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
పవర్ లాయర్ గా కనిపించే ఈ సినిమాలో కీర్తి సురేష్, అంజలి తదితరులు నటిస్తున్నారు. శృతిహాసన్ స్పెషల్ రోల్ లో కనిపిస్తుంది.