పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో తలపెట్టిన కవాతు నేడే. గోదావరి వంతెనపై ఈస్ట్-వెస్ట్ అనుసంధానం మాదిరిగా జనాలను భారీగా మోహరించి, అటు కార్లు, ఇటు పడవలతో జనాలను నింపేసి, జనసేన సత్తాచాటే ప్రయత్నం ఇది. ఆ మధ్య జగన్ పాదయాత్ర సమయంలో గోదావరి వంతెన మీద జనసందోహం భయంకరంగా కనిపించింది. బహుశా ఇదే స్పూర్తి అయి వుండొచ్చు పవన్ కవాతు అయిడియాకు.
ఈ సంగతి అలావుంచితే, ఈ కవాతు పనుల్లో కీలకంగా తలమునకలయ్యారు ఓ మెగా నిర్మాత. ఇటు అరవింద్ కు అటు బన్నీకి అత్యంత సన్నిహితుడు అయిన బన్నీ వాస్ దాదాపు వారం రోజులుగా రాజమండ్రిలో వుండి, టోటల్ కవాతు కార్యక్రమాలను, ఇతరత్రా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
బన్నీ వాస్ వెళ్లడం అంటే ఇటు అరవింద్ కు అటు బన్నీకి తెలియని వ్యవహారం కాదు. మెగా క్యాంప్ మొత్తం ఇప్పుడు పవన్ కు దన్నుగా వుందీ అనడగానికి ఇంతకన్నా పెద్దగా ఉదాహరణ అక్కరలేదు. ఇదిలా వుంటే ఈ కవాతు కార్యక్రమం కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈస్ట్, వెస్ట్ ల్లో టికెట్ లు ఆశిస్తున్నవారు, పార్టీ సానుభూతి పరులు, పార్టీకి ఆర్థికంగా దన్నుగా నిల్చున్నవారు, భారీగా ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.