Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ ఖండన వెనుక..?

పవన్ ఖండన వెనుక..?

సాధారణంగా సినిమా వ్యక్తుల మీద గ్యాసిప్ లు ఎక్కువగా వస్తుంటాయి. కానీ వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టుల మీద, కాంబినేషన్ల మీద గ్యాసిప్ లు వస్తే, పెద్దగా పట్టించుకోరు. అలాంటిది పవన్ కళ్యాణ్ పని కట్టుకుని, తనపై వచ్చిన సినిమా చేయబోతున్నాననే గ్యాసిప్ ను ఖండించారు. దానికోసం పత్రికా ప్రకటన ఇచ్చారు.

ఈ గ్యాసిప్ ఎవరికో సంబంధించినది కాదు. పవన్ పార్టీ కోసం తన టైమ్, డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తున్నారనే గ్యాసిప్ లు వున్న నిర్మాత రామ్ తాళ్లూరికి సంబంధించిందే. నిజానికి పవన్ దీనిని ఖండించకపోయినా, వచ్చిన నష్టంలేదు. కానీ ఖండన వెనుక వేరే విషయం వుందని తెలుస్తోంది.

పవన్ దగ్గర మైత్రీమూవీస్ అడ్వాన్స్ అలాగే వుంది. ఇంకా వెనక్కు ఇవ్వలేదు. ఎప్పటికైనా సినిమా చేస్తారనే ఆశతో మైత్రీమూవీస్ సంస్థ వుంది. ఈ గ్యాసిప్ రావడానికి ఒకటి రెండురోజుల క్రితమే మైత్రీమూవీస్ అధినేతలు పవన్ కు సినిమా గురించి, గుర్తుచేసినట్లు, తాను చెబుతానని పవన్ అన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో తన పార్టీకి మద్దతుదారైన రామ్ తాళ్లూరికి సినిమా చేస్తున్నానన్న గ్యాసిప్ మైత్రీ జనాలను కాస్త ఇబ్బంది పెడుతుందని పవన్ భావించి వుండొచ్చు. అందుకే అర్జెంట్ గా ప్రెస్ నోట్ విడుదల చేసి వుండొచ్చు.

అంతా బాగానే వుంది. కానీ, మరి పవన్ మీద చాలా గ్యాసిప్ లు వస్తున్నాయి. వాటిని కూడా ఖండిస్తూ ప్రకటనలు ఇవ్వవచ్చు కదా? నిన్న మొన్న ముంబాయి వెళ్లారని, అక్కడ కేటిఆర్ తో రహస్య సమావేశం జరిపారని గ్యాసిప్ లు వచ్చాయి. మరి దాన్ని ఎందుకు ఖండించనట్లు? అంటే అది నిజం అని ఒప్పుకుంటున్నట్లా? 

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?