Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రోబో 2.0 నిడివి 2.29

రోబో 2.0 నిడివి 2.29

గత కొన్నేళ్లుగా వార్తల్లో వుంటూ వస్తున్న రజనీ-శంకర్ ల రోబో 2.0 విడుదల ఇక రోజుల్లోకి వచ్చేసింది. ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్లు సెన్సార్ అయిపోయాయి. నిడిడి తెలుగు వెర్షన్ రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు. తమిళ వెర్షన్ నిడివి ఒక్క నిమిషం తక్కువ.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలను చాలా అంటే చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 1200 స్క్రీన్లలో రోబో 2.0 విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ రంగంలో బలంగా వున్న ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, యువి వంశీ కలిసి ఈసినిమా బాధ్యత తలకెత్తుకున్నారు.

తమిళనాడులో 750 స్క్రీన్లు, కర్ణాటకలో 700 స్క్రీన్లు, కేరళలో 500 స్క్రీన్లు రోబో 2.0 కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇవికాక అక్షయ్ కుమార్ వుండడం, రజనీ, శంకర్ కాంబినేషన్ కావడంతో బాలీవుడ్ లో కూడా భారీ విడుదల జరుగుతోంది.

లెక్కలు పక్కాగా అందడంలేదు కానీ, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడెనిమిది నుంచి తొమ్మిద వేల స్క్రీన్లలో రోబో 2.0 విడుదల అవుతుందని అంచనా. రోబో 2.0కి అంచనాకు మించి ఖర్చు అయింది. సుమారు 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు హక్కులే దగ్గర దగ్గర 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

నేరుగా త్రీడీలో చిత్రీకరించి, త్రీడీలో, కొన్ని చోట్ల టూ డీలో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. తొలిసారి ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ టెక్నీక్ ను ప్రఖ్యాత సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకొట్టి వాడారు. ప్రేక్షకులు ఈ సౌండ్ వల్ల, సినిమాను వర్చ్యువల్ రియాల్టీలో చూస్తున్నట్లు ఫీల్ అవుతారని మేకర్స్ చెబుతున్నారు.

సినిమా చివరి అరగంట ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుందని, రోబోలు, పక్షిలా మారే అక్షయ్ కుమార్ మధ్య జరిగే క్లయిమాక్స్ అద్భుతంగా వచ్చిందన్నది సెన్సారు టాక్. 

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?