పవన్ కు ఝలక్ ఇచ్చేందుకే ఇదంతా?

గడచిన నెల రోజులుగా ఓ విషయం గుసగుసల్లో నలుగుతోంది. పూనమ్ కౌర్ అనే నటి దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మెసేజ్ లో, వీడియోలో ఏవో వున్నాయని, వాటి కోసం…

గడచిన నెల రోజులుగా ఓ విషయం గుసగుసల్లో నలుగుతోంది. పూనమ్ కౌర్ అనే నటి దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మెసేజ్ లో, వీడియోలో ఏవో వున్నాయని, వాటి కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారన్నది ఆ గుసగుసల సారాంశం. వ్యాపార, సినిమా, రాజకీయ రంగాల్లో ఆసక్తి వున్న ఓ పెద్దాయన ఒకరు, సంచలన వార్తల కోసం ప్రయత్నించే ఛానెల్ వాటి కోసం ప్రయత్నిస్తున్నారని వినిపించింది.

ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడో సినిమాలు ఎత్తి కట్టేసిన పూనమ్ కౌర్ ను వెదుక్కుంటూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఒకటి వచ్చింది. తెలుగుదేశానికి అత్యంత సన్నిహితులైన రాఘవేంద్రరావు, ఆర్కామీడియా, ఈనాడు గ్రూపులు కలిసి అందించే స్వర్ణఖడ్డం అనే సీరియల్ లో పూనమ్ కౌర్ కు కీలకపాత్ర వచ్చింది.

ఇప్పుడు వున్నట్లుండి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఓ ఛానెల్ లో పూనమ్ కౌర్ ఇంటర్వూ ప్రసారం కాబోతోంది. దాని కోసం విడుదలయిన ప్రోమో కాస్త సంచలనంగానే వుంది. ఈ ప్రోమో చూస్తుంటే పూనమ్ చాలా సంచలన విషయాలు వెల్లడించినట్లు అనిపిస్తోంది.

కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ ఇంటర్వూలో అంత లేదట. పూనమ్ కౌర్, కర్ర విరగకుండా, పాము చావకుండా ఇంటర్వూ ఇచ్చినట్లు తెలుస్తోంది. హడావుడే తప్ప, ఈ ఇంటర్వూలో పవన్ కు డ్యామేజ్ చేసేది ఏమీ వుండదని తెలుస్తోంది.

ఇదంతా పవన్ ను కాస్త అలర్ట్ చేసి, కాస్త తగ్గేలా చేయడానికి వేస్తున్న ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు. అవకాశం ఇచ్చి, తమ క్యాంప్ లోకి తీసుకోవడం, అలాగే ఆమె ఇంటర్వూ ప్రత్యేకంగా ప్రసారం చేయడం ద్వారా పూనమ్ కౌర్ తమ క్యాంప్ లో వుందని పవన్ ను అలర్ట్ చేయడం తప్ప వేరు కాదని అనుకోవాల్సి వస్తోంది. అందుకే జస్ట్ కాస్త ఓ అలర్ట్ డోస్ ఇంటర్వూ ప్రసారం చేసి, పవన్ కు ఒకటో నెంబర్ హెచ్చరిక ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

మరి ఈ మాత్రం వ్యవహారాలు తెలియనంత చిన్న పిల్లాడు కాదు పవన్ కళ్యాణ్. పైగా పూనమ్ కౌర్ తో జనం అనుకుంటున్నట్లు, ఆయన వ్యవహారాలు ఏమీ వున్నాయి అన్నది ఆయనకు తెలుసు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆయనకే తెలుసు. అందువల్ల ఆయన స్ట్రాటజీలు ఆయనకు వుండే వుంటాయి.