cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

సల్మాన్‌, అర్జున్‌ కపూర్‌.. ఒక అక్రమసంబంధం!

సల్మాన్‌, అర్జున్‌ కపూర్‌.. ఒక అక్రమసంబంధం!

సల్మాన్‌ మంచోడు.. అని అంటారు బాలీవుడ్‌ జనాలు. ఆఖరికి సల్మాన్‌పై యాక్సిడెంట్‌ కేసు వచ్చినప్పుడు, అతడు అమాయక బ్లాక్‌ బక్స్‌ను వేటాడి చంపాడు అని కోర్టు నిర్ధారించినప్పుడు కూడా.. సల్లూకు అనేకమంది మద్దతుగా మాట్లాడారు. సల్మాన్‌ మనుషుల మరణానికి కారణం అయ్యాడు అని వార్తలు వచ్చినా, జింకలపై క్రౌర్యాన్ని ప్రదర్శించాడన్నా, తన ప్రేమను నిరాకరిస్తున్న ఐశ్వర్యరాయ్‌పై దాడికి పాల్పడ్డాడు అనే వార్తలు వచ్చినా.. అతడికి ఉన్న 'మంచోడు' ట్యాగ్‌ మాత్రం పోలేదు. దీనికంతటికీ కారణం కేవలం సల్మాన్‌కు ఉన్న ఆర్థికబలమో, స్టార్‌డమ్‌లు మాత్రమే కాకపోవచ్చు. ఎందుకంటే.. బాలీవుడ్‌లో సల్మాన్‌కు ధీటైన స్టార్లు, కోటీశ్వరులు చాలామందే ఉన్నారు. అయితే వారికి లేని 'మంచోడు' ట్యాగ్‌ సల్మాన్‌కే ఉంది.

సల్మాన్‌ కన్నా సందేశాత్మకమైన సినిమాలు చేసిన ఆమీర్‌ను 'భాయ్‌' అని, 'మంచోడు' అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. సల్మాన్‌ కన్నా స్టార్‌ హీరో అయిన షారూక్‌కు కూడా 'మంచోడు..' 'మనుసున్నోడు..' అనే కితాబులు అందవు. అయితే సల్మాన్‌కే అందుతాయి. అలా సల్మాన్‌ మంచితనంలో తడిసి ముద్దైన వాళ్లలో బోనీకపూర్‌ కూడా ఉన్నాడట. వెనుకటికి బోనీకపూర్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, నిర్మాతగా వరస ఫెయిల్యూర్లలో ఉన్న సమయంలో సల్మాన్‌ ఆదుకున్నాడట.

అది 'నోఎంట్రీ' సినిమాకు పారితోషకం ఏదీ తీసుకోకుండా సల్లూ హెల్ప్‌ చేశాడట. డబ్బు తీసుకోకుండా సల్లూ ఆ సినిమా చేశాడు. అది సూపర్‌ హిట్‌ అయ్యింది. బోనీకపూర్‌ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణం అయ్యింది. సల్మాన్‌ మంచితనపు ఎపిసోడ్స్‌లో అదీ ఒకటి. అయితే ఈ మధ్య బోనీకపూర్‌ కొడుకు మాత్రం సల్లూను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. హీరోగా నిలదొక్కుకునే యత్నాల్లో ఉన్న అర్జున్‌కపూర్‌ చాలా వ్యవహారాల్లో తలదూర్చేశాడు ఇప్పటికే.

ప్రత్యేకించి సల్మాన్‌ తమ్ముడి భార్య మలైకాతో అర్జున్‌కపూర్‌ ఎఫైర్‌ పెట్టుకున్నాడనే వార్తలు రావడం, అర్జున్‌కపూర్‌ కోసం మలైకా భర్తకు సైతం విడాకులు ఇవ్వడానికి వెనుకాడలేదు అనే ప్రచారం సల్లూను బాగా ఇబ్బంది పెట్టింది. తనంటూ పెళ్లి చేసుకోకపోయినా, సల్మాన్‌ తన కుటుంబీకులను మాత్రం బాగా చూసుకుంటాడు. వాళ్లు, వాళ్ల పిల్లలు బాగా ఉండాలని సల్మాన్‌ తపిస్తాడు. తన తమ్ముడి కాపురం కూలిపోతున్నప్పుడు సల్లూ చాలా బాధపడ్డాడట. 

విడాకులు వద్దని తమ్ముడికి, తమ్ముడి భార్యకూ వారించి చెప్పాడట. అయితే మలైకా ఎవరి మాటలకూ కన్వీన్స్‌ కాలేదని తెలుస్తోంది. అర్జున్‌కపూర్‌ అంతలా ఇన్‌ఫ్లుయన్స్‌ చేశాడట మలైకాను. ఒకప్పుడేమో సల్మాన్‌ బోనీకపూర్‌కు చాలా హెల్ప్‌ చేశాడు. బోనీ కుటుంబం నిలదొక్కుకోవడానికి సహకరించాడు. ఇప్పుడేమో బోనీకపూర్‌ తనయుడు సల్మాన్‌ కుటుంబాన్నే ఇబ్బంది పెట్టాడు. సల్మాన్‌ తమ్ముడి విడాకులకు కారణం అయ్యాడు.

ఈ విషయం తెలిసి బోనీకపూర్‌ కూడా బాగా ఫీలయ్యాడని సమాచారం. తనయుడిని వారించాడట.. మలైకా జోలికి వెళ్లవద్దని సూచించాడట. అలాగే అర్జున్‌కపూర్‌ను బాలీవుడ్‌ జనాలు అవాయిడ్‌ చేస్తున్నారట. అర్జున్‌తో సన్నిహితంగా ఉంటూ కనిపిస్తే సల్మాన్‌కు కోపం వస్తుందేమో అనేది సినీ జనాల భయంగా తెలుస్తోంది.

ఈ పరిణామాలపై ఇప్పుడిప్పుడు అర్జున్‌కపూర్‌ అలర్ట్‌ అవుతున్నాడని, భాయ్‌ కుటుంబానికి కోపం తగ్గించేలా, సల్మాన్‌కు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం!