పవన్ కు డేట్లు లేవని చరణ్ కి ఇస్తుందా?

సోనాక్షి సిన్హా..ఎన్నాళ్ల నుంచో టాలీవుడ్ జనాలను ఊరిస్తున్న పేరు. గబ్బర్ సింగ్ 2 కోసం పాపం, సంతప్ నంది,పవన్ అండ్ కో తెగ ప్రయత్నించారు. ఆరంభంలో ఆ సినిమా ఆలస్యం కావడానికి అదో కారణం.…

సోనాక్షి సిన్హా..ఎన్నాళ్ల నుంచో టాలీవుడ్ జనాలను ఊరిస్తున్న పేరు. గబ్బర్ సింగ్ 2 కోసం పాపం, సంతప్ నంది,పవన్ అండ్ కో తెగ ప్రయత్నించారు. ఆరంభంలో ఆ సినిమా ఆలస్యం కావడానికి అదో కారణం. చేయను అనకుండా, డేట్లు లేవు, బిజీ అంటూ ఊరించుకుంటూ వచ్చింది. ఆఖరికి ఆ ప్రాజెక్టుకు ఓ అనామక హీరోయిన్ దొరికింది, అదంతా వేరే సంగతి. 

చాలా మంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ల మాదిరిగానే సోనాక్షి కూడా తమిళ రంగానికి ఈజీగానే డేట్లు ఇచ్చేసింది. సినిమా కూడా విడుదలకు రెడీ అయిపోయింది. ఇప్పుడు తాజా విషయం ఏమిటంటే, రామ్ చరణ్ పక్కన సోనాక్షిని నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. లింగా అడియో ఫంక్షన్ కు ఆమె వచ్చినపుడు ఈ మేరకు ప్రతిపాదన మూవ్ అయినట్ల బోగట్టా. 

శ్రీను వైట్ల-చరణ్ కాంబినేషన్ కు సోనాక్షి అదనపు ఆకర్షణ అవుతుంది గ్యారంటీగా. సోగస కళ్ల సోనాక్షి ఓకె అంటుందా…? అంటుందనే అనుకోవాలి, ఎందుకంటే మెగాస్టార్, అరవింద్, చరణ్, శ్రీను వైట్ల వీళ్లందరికీ బాలీవుడ్ లో ఓ మాదిరిగా మంచి సంబంధాలే వున్నాయి మరి.