హీరో నితిన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. అది అనేకసార్లు బాహాటంగానే ప్రకటించాడు. నితిన్ సినిమా ఒకదాన్ని పవన్ కళ్యాణ్ సమర్పించాడు కూడా. బహుశా ఆ రిలేషన్ తోనే కావచ్చు, నితిన్ తండ్రి సుధాకర రెడ్డి నిన్నటికి నిన్న బయల్దేరి ఆంధ్రకు వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసారు. డీహైడ్రేషన్ తో బాధపడుతున్న పవన్ ను పరామర్శించారు.
అయితే ఈ విషయంలో ఇండస్ట్రీలో చిన్న గ్యాసిప్ కూడా వినిపిస్తోంది. నితిన్ తన తండ్రి సుధాకర రెడ్డి ద్వారా కొంత విరాళం జనసేన పార్టీకి పంపించి, అభిమానం చాటుకున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అయితే ఆ అమౌంట్ ఎంత అన్నది తెలియదు కానీ, విరాళం ఇచ్చారని మాత్రం సుధాకర రెడ్డి సన్నిహిత వర్గాల బోగట్టా.
రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వడం తప్పుకాదు, పాపమూ కాదు. మెగాహీరోలు కాకుండా వేరే హీరో పవన్ కు ఫండ్ ఇవ్వడం అన్నది మాత్రమే వార్త. అయితే అది ఒపెన్ గా కాకుండా సైలెంట్ గా ఇవ్వడం అన్నది ఆసక్తికరం.