గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తున్న కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు జూన్ నుంచి షెడ్యూళ్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సైరా వర్క్ దాదాపు పూర్తికావచ్చింది. మే నెల మొత్తం మీద సైరా సినిమా ప్యాచ్ వర్క్ వుంటుంది. దేశంలోని అనేక లొకేషన్లలో ఈ ప్యాచ్ వర్క్ వుంటుందని తెలుస్తోంది.
జూన్ నుంచి కొరటాల శివ సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లి, సమ్మర్ 2020 టార్గెట్ గా ఫినిష్ చేయాలన్నది ప్రస్తుతానికి అనుకుంటున్న ప్లాన్. కొరటాల శివ డైరక్షన్ లో నిర్మించే ఈ సినిమాను నిరంజన్ రెడ్టి, రామ్ చరణ్ కలిసి నిర్మిస్తారు. శృతిహాసనం హీరోయిన్ అని టాక్ వుంది.
దీని తరువాత త్రివిక్రమ్-చిరు సినిమా అన్న అనౌన్స్ మెంట్ అయితే వుంది కానీ, అదికాస్త అనుమానమే. పవన్ సిన్మాల్లోకి రీఎంట్రీని బట్టి ఆ ప్రాజెక్టు వుంటుంది.