మహర్షిలో అంతర్మధనం.. ట్రయిలర్ పరిస్థితేంటి?

మహర్షి టీజర్ లో మైక్ ముందు మహేష్ మాట్లాడే సీన్ ఉంది. అచ్చం భరత్ అనే నేను సినిమాలో సీన్ ను తలపిస్తుంది. ఇక మహర్షి టీజర్ లో ఓ ఫైట్ సన్నివేశం కూడా…

మహర్షి టీజర్ లో మైక్ ముందు మహేష్ మాట్లాడే సీన్ ఉంది. అచ్చం భరత్ అనే నేను సినిమాలో సీన్ ను తలపిస్తుంది. ఇక మహర్షి టీజర్ లో ఓ ఫైట్ సన్నివేశం కూడా పెట్టారు. అచ్చం శ్రీమంతుడులో మామిడి తోపు ఫైట్ లాగానే ఉంటుందది. ఇలా చూసుకుంటే మహర్షి టీజర్ లో మరో 2-3 సన్నివేశాలు పాత సినిమాల్ని గుర్తుకుతెస్తుంటాయి.

మహర్షి సినిమాలో మహేష్ కు సంబంధించి ఇంతకంటే కొత్తగా ఇంకేం లేవా? టీజర్ లోనే ఇలా పాత సినిమాల్ని గుర్తుకు తెస్తే ట్రయిలర్ పరిస్థితేంటి? ఆ తర్వాత సినిమా పరిస్థితేంటి? సరిగ్గా ఇదే ఫీడ్ బ్యాక్ అందింది మహర్షి యూనిట్ కు. అందుకే ఇప్పుడు యూనిట్ అంతా చర్చల్లో మునిగిపోయింది. టీజర్ పై వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ట్రయిలర్ పై పూర్తి కసరత్తు ప్రారంభించింది.

మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమా కాబట్టి కచ్చితంగా కొత్తగా ఉంటుందని ఆశిస్తారు జనం. కానీ టీజర్ లో మాత్రం ఆ కొత్తదనం కనిపించలేదు. మేటర్ రిలీజ్ చేయకూడదనే ఉద్దేశంతో టీజర్ అలా కట్ చేశారేమో అని సర్దిచెప్పుకున్నప్పటికీ, సినిమాలో అంతకుమించి సన్నివేశాలు లేవా అనే అనుమానం మాత్రం ప్రేక్షకులకు కలిగింది.

ఈ ఫీడ్ బ్యాక్ మహేష్ కు కూడా అందింది. అందుకే సినిమా థీమ్ ఏంటో చెప్పేలా ట్రయిలర్ కట్ చేయాలని సూచించాడు. పైగా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయని, వాటిని మరింత పెంచేలా వ్యవహరించొద్దని కూడా సూచించాడట.

టీజర్ కు రికార్డ్ వ్యూస్ వచ్చినప్పటికీ, నెగెటివ్ కామెంట్స్ కూడా అదే స్థాయిలో పడ్డాయి. అందుకే యూనిట్ ఇలా ట్రయిలర్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. త్వరలోనే ఓ ఫ్రెష్ లుక్ తో మహర్షి ట్రయిలర్ రాబోతోందట. అది కాస్త కొత్తగా ఉంటుందని ఆశిద్దాం.

చివరికి పవన్ కల్యాణ్ కథ ఇదీ!