త్రివిక్రమ్-బన్నీ- నాన్న..నేను

ఇప్పుడు అంతా వైవిధ్యమైన టైటిళ్ల టైమ్ నడుస్తోంది. అత్తారింటికి దారేది దగ్గర నుంచి మొదలయింది. నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, భరత్ అనే నేను ఇలా పెద్ద డైరక్టర్లు అంతా వైవిధ్యమైన పేర్లను సినిమాలకు…

ఇప్పుడు అంతా వైవిధ్యమైన టైటిళ్ల టైమ్ నడుస్తోంది. అత్తారింటికి దారేది దగ్గర నుంచి మొదలయింది. నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, భరత్ అనే నేను ఇలా పెద్ద డైరక్టర్లు అంతా వైవిధ్యమైన పేర్లను సినిమాలకు పెడుతున్నారు. హీరోలు కూడా వాళ్ల మాటకు అడ్డు చెప్పడంలేదు. అ..ఆ..అత్తారింటికి దారేది, అరవింద సమేత లాంటి వైవిధ్యమైన టైటిళ్లు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు తాను చేయబోయే బన్నీ సినిమాకు కూడా అలాంటి టైటిల్ నే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బన్నీ-త్రివిక్రమ్ సినిమా తండ్రీ కొడుకుల అనుబంధం బ్యాక్ డ్రాప్ లో వుంటుందని తెలుస్తోంది. తండ్రి ఆడే అబద్దాలను, నిజాలుగా మార్చే కొడుకు అనే లైన్ ఏదో వుందని వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాకు' నాన్న-నేను' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. అలాగే 'నేను-మానాన్న' అనే ఆల్టర్ నేటివ్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు వినికిడి.

ఈనెల 13న లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 24 నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్తారు. తమిళ, మళయాల, హిందీ నటుల కలయికతో, కాస్త భారీ కాస్టింగ్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

చివరికి పవన్ కల్యాణ్ కథ ఇదీ!