పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత మూడు సినిమాలు ఓకె చేసారు. వేణు శ్రీరామ్, క్రిష్, హరీష్ శంకర్ ల సినిమాలు. ఇవి కాక నాలుగో సినిమా కూడా ప్రకటించే అవకాశం వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో రాబోయే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నాలుగో సినిమా ప్రకటన వుండే అవకాశం వుంటుంది.
ఆరంభించిన వకీల్ సాబ్ ఇంకా పూర్తి కావాల్సి వుంది. రష్యా వ్యాక్సీన్ నో మరోటో వస్తే, డిసెంబర్ నుంచి షూట్ కు వస్తాను అని పవన్ కళ్యాణ్ నిర్మాత దిల్ రాజకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత క్రిష్ సినిమా మొదలు కావాలి. అంటే ఇంకా కనీసం అయిదు నెలల కాలం పడుతుంది. అందుకే ఆ గ్యాప్ లో ఓ సినిమా చేసి వచ్చేయాలన్నది క్రిష్ ప్లాన్.
తొలిసినిమా ఇదే
కరోనా తరువాత షూటింగ్ లు ప్రారంభం ఎప్పుడు అన్నది తెలియని టైమ్ లో, ధైర్యంగా షూటింగ్ కు వెళ్తున్నతొలిసినిమా క్రిష్ దే. సింగిల్ షెడ్యూలులో నలభై రోజుల్లో సినిమా చేసి వచ్చేస్తానని పవన్ కు చెప్పి, క్రిష్ కొత్త సినిమాకు హీరో వైష్ణవ్ తేజ్ తో శ్రీకారం చుట్టారు. నలభై రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఆ సినిమా ను ఫినిష్ చేసి పవన్ సినిమా మీదకు రావాలన్నది ప్లాన్. పవన్ సినిమా కనుక ఆలస్యం అయితే క్రిష్ కు మరింత టైమ్ దొరకుతుంది.
నాలుగో సినిమా
ఇలాంటి టైమ్ లో పవన్ మరో సినిమాను త్వరలో ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుందన్నది వార్తల సారాంశం. 2021లో పవన్ మహా అయితే రెండు సినిమాలు పూర్తి చేయగలరు. అంటే 2022 కు కూడా సినిమాలను పవన్ ఒప్పుకుంటున్నట్లు అనుకోవాలి. కానీ ఒకటే సమస్య. పొలిటికల్ లీడర్లకు వ్యవహారం ఎప్పుడు ఎలా వుంటుందో తెలియదు. అందువల్ల ఏ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో? ఏ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుందో అస్సలు తెలియదు.