Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ రాకపై మెగా క్యాంప్ కాన్ఫిడెన్స్

పవన్ రాకపై మెగా క్యాంప్ కాన్ఫిడెన్స్

మెగా ఈవెంట్..మెగాస్టార్ 150 వ సినిమా ప్రీ సక్సెస్ మీట్ కు భారీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఫోన్ లో పిలిచే కార్యక్రమం కూడా చకచకా సాగిపోతోంది. అయితే ఈ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడా? రాడా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే మెగా క్యాంప్ వర్గాలు మాత్రం పవన్ కచ్చితంగా వస్తారనే అంటున్నాయి.  

ముందుగా ప్రకటిస్తే, సమస్యలు వస్తాయని, ఈ విషయం గుట్టుగా వుంచినట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ కు మించిన మెగా ఫంక్షన్ మెగా క్యాంప్ లో మళ్లీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఇలాంటి ఈవెంట్ కు హాజరుకాకపోవడం, అలాగే సప్తగిరి, నితిన్ లాంటి మిగిలిన నటుల ఫంక్షన్ లకు హాజరు కావడం అన్నది అన్ని విధాలా రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందనే విషయం పవన్ కు క్లారిటీగా కమ్యూనికేట్ చేసినట్లు, ఆయన కూడా హాజరవుతాననే చెప్పినట్లు తెలుస్తోంది. 

అందుకే పవన్ హాజరుపై  మెగా క్యాంప్ లోని కీలక జనాలు అంతా కాన్ఫిడెంట్ గా వున్నారు. మెగా క్యాంప్ లో జనాలు పవన్ వస్తారనే ఒకరికి ఒకరు సమాచారం సర్క్యులేట్ చేసుకోవడం విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?