అంతన్నాడు..ఇంతన్నాడే..గంగరాజు అన్నట్లుగా వుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోయిన్ వ్యవహారం. పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి. సోనాక్షి సిన్హా నుంచి జెన్నిఫర్ వరకు. కానీ ఆఖరికి ఇప్పడు నిధి అగర్వాల్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ మేరకు డిస్కషన్లు సాగుతున్నాయి. ఆల్ మోస్ట్ నిధి అగర్వాల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా చేయడానికి బాలీవుడ్ బిగ్ హీరోయిన్లు ఎవ్వరూ సుముఖత చూపించకపోవడం ఒక కారణం అయితే, రెమ్యూనిరేషన్లు మరో కారణం. క్రిష్-పవన్ సినిమా మొత్తాన్ని నిర్మాత ఎఎమ్ రత్నం ఫైనాన్స్ మీదనే నెట్టుకురావాల్సి వుంది. ఈ మేరకు నిర్మాత ఎఎమ్ రత్నం టోటల్ ప్రాజెక్టు నెగటివ్ రైట్స్ ను బిగ్ ఫైనాన్సియర్ సత్య రంగయ్య ప్రసాద్ దగ్గర పెట్టి, వ్యవహారం నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ద్వారానే ఏ అమ్మకాల లావాదేవీలు అయినా సాగించాలి.
హిందీ శాటిలైట్, డిజిటల్, తెలుగు శాటిలైట్, అడియో అన్నీ కలిపి 60 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా వీటిని డీల్ చేసే పనిలో వున్నట్లు బోగట్టా. ఇలాంటి నేపథ్యంలో వీలయినంత ఖర్చు తగ్గించే ఆలోచనతో నిధి అగర్వాల్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.