పవన్‌ ‘సర్దార్‌’లో మెగాస్టార్‌.!

పవన్‌కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. చిత్ర యూనిట్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సినిమా షూటింగ్‌ విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే, చిరంజీవి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కన్పిస్తారా.?…

పవన్‌కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. చిత్ర యూనిట్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సినిమా షూటింగ్‌ విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే, చిరంజీవి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కన్పిస్తారా.? పవన్‌ని కలిసేందుకే చిరంజీవి, 'సర్దార్‌' సెట్స్‌కి వెళ్ళారా.? అన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. 

సినీ వర్గాల్లో మాత్రం, పవన్‌కళ్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ మీద కాస్సేపు చిరంజీవి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కన్పిస్తారన్న గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. చిరంజీవి హీరోగా నటించిన 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' సినిమాలో ఓ పాటలో పవన్‌ కన్పిస్తాడు. 'శంకర్‌ దాదా జిందాబాద్‌'లో అయితే ఏకంగా పవన్‌ ఓ ఫైట్‌ చేసేస్తాడు కూడా. అలాంటి గెస్ట్‌ రోల్‌లో చిరంజీవి, 'సర్దార్‌' కోసం కన్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవలే తన కుమారుడు చరణ్‌ నటించిన 'బ్రూస్‌లీ'లో చిరంజీవి ఓ ఫైట్‌లో కన్పించారు కూడా.

ఇదిలా వుంటే, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ప్రమోషన్‌ కోసం తన వంతు సహకారంగానే చిరంజీవి, సినిమా సెట్స్‌కి వెళ్ళారనీ, చిరంజీవి – 'సర్దార్‌'లో నటిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదనే మరో వాదన కూడా విన్పిస్తోంది. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్స్‌కి చరణ్‌ కూడా వెళ్ళనున్నాడట. ఆ మధ్య పవన్‌తో కలిసి సెట్స్‌లో, సాయిధరమ్‌తేజ పోలీస్‌ గెటప్‌లో సందడి చేసిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. 

ఎలాగైతేనేం.. మెగా ఫ్యామిలీలో విభేదాలంటూ వస్తున్న వార్తలకి, చిరంజీవి – 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్స్‌లో దర్శనమివ్వడం ద్వారా ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారనుకోవచ్చు.