మగాడితో అవసరం ఆ ఒక్కదానికే అంటోంది ప్రియాంక చోప్రా! ఇదేదో డబుల్ మీనింగ్ స్టేట్ మెంట్ కాదు… ఈ మాజీ విశ్వసుందరి ఇచ్చింది సింగిల్ మీనింగ్ స్టేట్ మెంటే! మగాడితో తనకు ఒకే అవసరం ఉందని.. అది పిల్లల కోసమే అని ప్రియాంక చోప్రా తేల్చి చెప్పింది. అంతకు మించి మగాళ్లతో తనకు ఏ అవసరం లేదని ఆమె వివరించింది. తాజాగా ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది.
మిగిలిన బాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే పెద్దగా ప్రేమాయణాలతోనూ.. డేటింగ్ వార్తల్లోనూ కనపడదు ప్రియాంక. చాలా కాలం నుంచే హీరోయిన్ గా లీడ్ లో ఉన్న ప్రియాంక తో ఈ విషయాల గురించి ఆరా తీసింది ఆ పత్రిక. కొంతమంది హీరోయిన్లు.. అనునిత్యం ఏదో ఒక ప్రేమ వ్యవహారంతో వార్తల్లోకి వస్తుంటారు.. ఒక ప్రేమికుడితో బ్రేకప్ అయిన కాలంలోనే మరోప్రియుడితో వ్యవహారాన్ని మొదలు పెట్టేస్తూ ఉంటారు.. అలాంటి విషయాలకు ప్రియాంక కాస్త భిన్నమే!
ఇలాంటి నేపథ్యంలో తన తీరు ను విశదీకరిస్తూ.. తను మగాళ్ల నుంచి దేన్నీ ఎక్స్ పెక్ట్ చేయనని తేల్చి చెప్పింది. ఖరీదు కట్టలేని ప్రేమనో… ఖరీదైన వజ్రాలనో వారి నుంచి కోరుకోనని.. చెప్పింది. తను సొంతంగా సంపాదించుకొంటానని.. తనకు అవసరమైన వాటిని కొనుక్కోగలనని అలాంటప్పుడు మెయింటెయినెన్స్ కోసం ప్రియులను మెయింటెయన్ చేయాల్సిన అవసరం లేదని ప్రియాంక చెప్పింది. అయితే సృష్టి సహజమైన విషయంలో మాత్రం మగాడికి విలువనిస్తూ… అంత వరకూ గౌరవాన్నే ఇచ్చింది ప్రియాంక. మెచ్యూర్డ్, బోల్డ్, ఇండిపెండెంట్.. అనే అభిప్రాయాలు కలుగుతున్నాయిప్పుడు ఈ మాజీ విశ్వసుందరి గురించి!