ఆ మధ్య ఓ వార్త పవర్ స్టార్ అభిమానులకు చిన్న షాక్ ఇచ్చింది..తెలుగులో పవన్, మహేష్ లు ఇద్దరికీ రెండు డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఎస్ జె సూర్యతో మళ్లీ పవర్ స్టార్ ఓ సినిమా చేయబోతున్నారన్నదే ఆ వార్త. అలాగే డ్యాన్స్ మాస్టర్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారని. ఏమిటిదంతా..పవన్ కేమయింది..ఏమిటా ధీమా? మరేమిటా నమ్మకం? అంటే ఇప్పడు ఆన్సర్ వినిపిస్తోంది.
తమిళనాట సూపర్ హిట్ అయిన ఓ సినిమాను పవన్ తెలుగులో చేయాలని అనుకుంటున్నారట. అందుకే రీమేక్ సబ్జెక్ట్, సేఫ్ ప్రాజెక్టు కాబట్టే, ఈ ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..తమిళ సూపర్ స్టార్ ల్లో ఒకరైన అజిత్ నటించిన వీరమ్. భలే కథ ఇది. ఒక విధంగా గతంలో మన తెలుగునాట కూడా సూపర్ హిట్ అయిన పెద్దరికం సినిమాకు దగ్గరగా వుంటుంది. అయితే పెద్దరికం కేవలం ఒక యాంగిల్ అయితే ఇందులో ఇంకా ఉపకథలు చాలా వుంటాయి.
ఆ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నగా అజిత్ నటించాడు. ఆ క్యారెక్టర్ ను ఇప్పుడు పవన్ చేయాలనుకుంటున్నారని వినికిడి. కథలో అన్ని రసాలు వుంటాయి. కాస్త ఫన్ టచ్ వుంటుంది. ఫ్యామిలీ అటాచ్ మెంట్లు వుంటాయి..యాక్షన్ వుంటుంది..ఇలా అన్నీ. అందుకే పవన్ కు తెగ నచ్చేసిందని తెలుస్తోంది. సో సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ఈ సినిమా వుండొచ్చు. మరి నిర్మాతలు మైత్రీ మూవీస్ కావచ్చు.