మారుతి మెగా క్యాంప్‌లో వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. మెగా మనుషులంటే, ఆ కాంపౌండ్ వ్యక్తులంటే బ్లడ్ ఇచ్చేస్తాడు. పవన్ కల్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. పవన్‌తో ఓ సినిమా చేయాల్సిందే… అని గట్టిగా ఫిక్సయ్యే ఈ రంగంలోకి వచ్చాడు. పవన్ కోసం కొన్ని కథలు కూడా రాసుకొన్నాడు. అందులో ఓ కథే… వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్న రాథా.
అవును… ఇది పవన్ కోసం మారుతి తయారు చేసుకొన్న కథ అట. కొన్ని మార్పులతో .. వెంకీకి సెట్ చేశాడని సమాచారమ్. రాథా గురువారం మొదలైంది. తొలి రోజే రాథా స్టిల్స్ బయటకు వచ్చాయి. ఓ పెద్ద హీరోతో ఫొటో షూట్ జరిపించి మరీ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడంటే మారుతి ప్లానింగ్‌కి మెచ్చుకోవలసిందే. ఆ ఫొటో స్టిల్స్ కూడా ముచ్చటగొలిపేలానే ఉన్నాయి.
చిన్న సినిమాలతో పెద్ద దర్శకుడిగా అవతారం ఎత్తిన మారుతి, ఆ ఛాన్స్ నిలబెట్టుకొంటే – పవన్ నుంచి పిలుపొచ్చినా రావొచ్చు. మారుతి కల నిజం కావొచ్చు..!