అనుష్క రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ప్రియుడితో పట్టపగలు రోడ్డుమీద సరసాలు ఆడుతూ… కెమెరాకు చిక్కింది. ఇంతకీ మేం చెప్పబోయేది మన స్వీటీ అనుష్క గురించి కాదు… బాలీవుడ్ సోయగం అనుష్క శర్మ గురించి. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్కల మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. మాది కేవలం స్నేహం మాత్రమే, ఇంకేం లేదని చాలాసార్లు మీడియాకు విన్నవించుకొన్నారిద్దరూ.
అయితేఈసారి మాత్రం అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం భారతజట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. విరాట్‌ని చూడకుండా ఉండలేకపోయిందేమో… అనుష్క శర్మ కూడా న్యూజీలాండ్ బయల్దేరిపోయింది. మ్యాచ్ లేని రోజుల్లో ఈ ప్రేమ పక్షులిద్దరూ చెట్టాపట్టాలేసుకొని వెల్లింగ్టన్ వీధుల్లో తెగ తిరిగేస్తున్నారు.
వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దాంతో బాలీవుడ్ జనాలు మాట్లాడుకోవడానికి మరో టాపిక్ దొరికినట్టైంది. వీరిద్దరూ కాలక్షేపపు ప్రేమికులా? లేదంటే కలకాలం నిలచి ఉంటారా అన్నది కాలమే చెప్పాలి.