ప‌వ‌న్‌నీ మొహమాట పెట్టేసాడు

త‌నయుడి మూవీని ప్రమోట్ చేయ‌డానికి బ్రహ్మానందం పాటిస్తున్న స్ట్రాట‌జీ అదిరిపోయింది. గౌత‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన బ‌సంతీ సినిమాకి వీలైనంత ప‌బ్లిసిటీ ఇవ్వాల‌ని డిసైడ్ అయిపోయాడు బ్రహ్మీ. తొలుత ట్రైల‌ర్‌ని మ‌హేష్ బాబు ఆగ‌డు సెట్లో…

త‌నయుడి మూవీని ప్రమోట్ చేయ‌డానికి బ్రహ్మానందం పాటిస్తున్న స్ట్రాట‌జీ అదిరిపోయింది. గౌత‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన బ‌సంతీ సినిమాకి వీలైనంత ప‌బ్లిసిటీ ఇవ్వాల‌ని డిసైడ్ అయిపోయాడు బ్రహ్మీ. తొలుత ట్రైల‌ర్‌ని మ‌హేష్ బాబు ఆగ‌డు సెట్లో విడుద‌ల చేశారు. ఆన‌క‌… ఎన్టీఆర్‌తో ఓ పాటను రిలీజ్ చేశారు. 

రేపు ఏకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌నే రంగంలోకి దింపుదామ‌ని ప్లాన్ వేస్తున్నాడు బ్రహ్మానందం. బ‌సంతీ ఆడియోని ప‌వ‌న్ చేతుల మీదుగా జ‌రిపిస్తాడ‌ట‌. బ్రహ్మానందం అంటే ప‌వ‌న్‌కి ప్రత్యేక‌మైన అభిమానం. అందుకే ప‌వ‌న్ కూడా ఈ కార్యక్రమానికి రావ‌డానికి రెడీ అయిపోయాడు. 

ఈ వేడుక‌కు త్రివిక్రమ్‌తో స‌హా సినీ ప్రముఖులంతా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌థానాయ‌కుడిగా నిల‌దొక్కుకోవాలంటే గౌత‌మ్ చేతిలో ఉన్న చివ‌రి అవ‌కాశం ఇది. అందుకే బ్రహ్మానందం కూడా ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోద‌ల‌చుకోలేదు. త‌నవైపు నుంచి ఏం చేయాలో అన్నీచేస్తున్నాడు. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో మ‌రి?