పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మాత్రమే కాదు జనసేనాధిపతి కూడా. ఎవరు అవునన్నా, కాదన్నా, రాష్ట్రంలో 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడం వెనుక పవన్ కళ్యాణ్ తోడు వుండడం అన్నదీ కీలమైన ఓ ఫ్యాక్టర్ అన్నది వాస్తవం.
అందుకే పవన్ ను నొప్పించకుండా, అతని ఇగో హర్ట్ కాకుండా చంద్రబాబు మాగ్జిమమ్ చూసుకుంటున్నారన్నది అంతకన్నా వాస్తవం. అయినా కూడా ఎక్కడో చిన్న బెరుకు, పవన్ ఎక్కడ స్వంత దుకాణం పెడతారో అని. పవన్ మనసులో ఏముందో, 2019 నాటికి ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యం.
ఇదిలా వుంటే పవన్ లేటెస్ట్ సినిమాకు సంబంధించిన ఓ మ్యూజిక్ బిట్ బయటకు వదిలారు. ఈ విడియో బిట్ చివర్న పవన్ కనిపిస్తారు. ఎలా కనిపిస్తారు అంటే.. ఆయన నిలువుగా, స్టడీగా వుంటారు. ఆయన జస్ట్ అలా అనగానే పక్కన స్టేబుల్ గా నాలుగు కాళ్లతో కుదరుగా వుండాల్సిన కుర్చీ గింగిరాలు కొడుతుంది.
త్రివిక్రమ్ లాంటి ఇంటిలిజెంట్ డైరక్టర్ ఏదీ ఊరికనే చేయరు. ఆయన తీసే సీన్లు చాలా డిటైల్డ్ గా లోతుగా వుంటాయి. అంటే పవన్ తలుచుకుంటే కుర్చీలు షేక్ అవుతాయి అని ఇండైరెక్ట్ గా చెప్పినట్లు అనుకోవాలేమో?
గతంలో ఎప్పుడో బాలయ్య బాబు చిటికేస్తే కుర్చీ కదలి వచ్చింది. ఇప్పుడు పవన్ బాబు టచ్ చేస్తే కుర్చీ గింగిరాలు తిరిగింది.