Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పవన్‌తో మళ్లీ అతడేనా?

పవన్‌తో మళ్లీ అతడేనా?

గబ్బర్‌సింగ్‌ 2 చిత్రం కాన్సిల్‌ అవడంతో పవన్‌కళ్యాణ్‌కి ఇప్పుడు ‘గోపాల గోపాల’ మినహా కన్‌ఫర్మ్‌డ్‌ ప్రాజెక్ట్‌ లేదు. గబ్బర్‌సింగ్‌ 2 తర్వాత చేద్దామని అనుకున్న పివిపి సినిమాకి కూడా ఇంతవరకు డైరెక్టర్‌ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ సెట్‌ అయిన ప్రాజెక్ట్‌ కాన్సిల్‌ చేసిన పవన్‌ ఏ సినిమా చేయబోతున్నాడు?

గబ్బర్‌సింగ్‌ డైరెక్ట్‌ చేసిన హరీష్‌ శంకర్‌తోనే పవన్‌కళ్యాణ్‌ మలి చిత్రం ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. నిజానికి గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌నే హరీష్‌తో చేద్దామని పవన్‌ అనుకున్నాడు. కానీ అప్పుడు హరీష్‌ వేరే చిత్రానికి కమిట్‌ అవడంతో సంపత్‌ నందికే అవకాశం దక్కింది. అయితే రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌తో హరీష్‌కి ఓకే అయిన సినిమా కూడా చేజారింది. 

మళ్లీ పవన్‌, హరీష్‌ కాంబినేషన్‌ అంటే గబ్బర్‌సింగ్‌ 2 ఇదే అవుతుందేమో అనుకోవచ్చు. అయితే ఆ ఐడియానే పవన్‌ కంప్లీట్‌గా డ్రాప్‌ అయ్యాడట. సో.. హరీష్‌ శంకర్‌ డైరెక్ట్‌ చేసినా కానీ అది కొత్త సబ్జెక్ట్‌ అవుతుందే కానీ గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌ మాత్రం ఇక ఉండదట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?