వర్మ ఆలోచన ముందే చెప్పాం

పంపిణీ రంగాన్ని పక్కన పెట్టి, సినిమాను నేరుగా థియేటర్ కు అందించాలని రామ్ గోపాల్ వర్మ ఆలోచన చేస్తున్నాడని కొద్ది రోజులకు ముందే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించారు. సినిమా…

పంపిణీ రంగాన్ని పక్కన పెట్టి, సినిమాను నేరుగా థియేటర్ కు అందించాలని రామ్ గోపాల్ వర్మ ఆలోచన చేస్తున్నాడని కొద్ది రోజులకు ముందే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించారు. సినిమా నిర్మాణం వరకు నిర్మాత చేతిలోవుంటుంది. 

కానీ ఆ తరువాత సినిమా ఎవరైనా కొనాలి లేదా, నిర్మాత స్వయంగా థియేటర్లకు అడ్వాన్స్ లు ఇచ్చి, విడుదలచేసుకోవాలి. అద్దెలు చెల్లించుకుని, కలెక్షన్ల ను తాను తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైనే వర్మ దృష్టి సారించాడు. థియేటర్ల వారీగా సినిమాను అమ్మేయాలని చూస్తున్నాడు. ఎవరైనా కొనుక్కోవచ్చు. కానీ విడుదల బాధ్యత, కలెక్షన్లు లెక్కలు సినిమా నిర్మాతే చూస్తారు. ఏ థియేటర్ కలెక్షన్లు ఆ హక్కులు కొన్నవారికి అందిస్తారు. అదీ అయిడియా. 

దీనికోసం ఫిల్మ్ ఆక్షన్  డాట్ ఇన్ పేరుతో ఓ వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. యాభై వేల నుంచి మూడున్నర లక్షల చిన్నమొత్తంతో సినిమాను కొనేసుకోవచ్చని, కొంత మంది కుర్రాళ్లు, కిట్టీ పార్టీ చేసుకునే మహిళలు, ఐటి ఉద్యోగులు ఇలా ఎవరైనా గ్రూప్ గా వచ్చి కొనుక్కొవచ్చని వర్మ చెబుతున్నారు.

చూడాలి ఈ గేలానికి ఎలాంటి చేపలు పడతాయో?