ఏ కాంబినేషన్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ కళ్లు కాయలకాచేలా ఎదురుచూస్తుందో ఆ కాంబినేషన్ – పవన్ కల్యాణ్, రాజమౌళి. పవన్ కల్యాణ్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి రెడీ అంటూ రాజమౌళి పవన్ అభిమానుల ముందే ప్రకటించేశాడు. బాహుబలి అడ్డొచ్చాడుగానీ లేదంటే ఈపాటికే పవన్ -రాజమౌళి కాంబినేషన్ సెట్టయిపోయేది అనేది ఫిల్మ్‌నగర్ టాక్.
రాజమౌళి ఈమధ్య పవన్‌ని కలిశాడు. ఓ లైన్ చెప్పాడు.. అని ప్రచారం సాగింది. బాహుబలి తరవాత జక్కన్న తీయబోయే సినిమా పవన్ కల్యాణ్‌దే అన్నారు. కానీ ఈ సినిమా లేదట. అసలు పవన్‌కి కలుసుకోలేదని, ఇక కథ చెప్పడం ఏమిటని అంటున్నాడు రాజమౌళి. ఏమైనా ఉంటే నేనే చెబుతా… అని ఈ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇప్పుడు కాకపోయినా రాబోయే రెండేళ్లలో ఈ కలయిక ఉండడం ఖాయం అని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. రెండేళ్లంటే చిత్రసీమలో ఎక్కువ వ్యవధే. ఈలోగా ఎన్నయినా జరగొచ్చు. చూద్దాం.. ఏమవుతుందో?