గప్‌చుప్‌గా ఓ చిన్న సినిమా తీసి, దానికి తన బ్రాండ్ ఇమేజ్ ఆపాదించి – కోట్టు వెనకేసుకొనే విద్య రాంగోపాల్ వర్మకి బాగా తెలుసు. ఇప్పుడు అదే ఫార్ములా పూరి జగన్నాథ్ కూడా అనుసరిస్తున్నాడు. హార్ట్ ఎటాక్‌తో కాస్త తెరిపిన పడ్డాడు పూరి. వెంటనే మహేష్ బాబుతో మరో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. దాంతో పూరి క్యాంపులో సంబరాలే సంబరాలు.
హార్ట్ ఎటాక్ వల్ల నిర్మాతగానూ నాలుగు డబ్బులు వెనకేసుకోగలిగాడు పూరి. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మరో సినిమా చేయబోతున్నాడు. ఔను… మహేష్‌బాబు ప్రస్తుతం ఆగడు షూటింగ్‌లో ఉన్నాడు. అది పూర్తయ్యేటప్పటికి కనీసం నాలుగు నెలలైనా పడుతుంది. ఈలోగా ఖాళీగా ఉండడం ఇష్టంలేని పూరి, ఈ గ్యాప్ లో ఓ చిన్న చిత్రం తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నాడు.
ఓవైపు మహేష్‌కి చెప్పిన లైన్ డవలెప్ చేస్తూనే, ఇంకోవైపు సినిమా తీసేస్తాడట. అయితే ఈ సినిమా ప్రభావం మహేష్‌తో తీయబోయే సినిమాపై పడకుండా చూసుకొంటున్నాడు. అందుకే రిస్క్ లేని ఓ చిన్న సినిమా, అందరూ కొత్తవాళ్లతో తీయాలన్నది పూరి ప్లాన్. అయితే ఈ సినిమాని తాను డైరెక్ట్ చేస్తాడా? లేదంటే తన శిష్యులకు అప్పగించి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడా అన్నది తెలియాల్సివుంది.