Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌, వెంకీ.. ఈసారి త్రివిక్రమ్‌తో.?

పవన్‌, వెంకీ.. ఈసారి త్రివిక్రమ్‌తో.?

పవన్‌కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా సెట్స్‌ మీదకు రానున్న విషయం విదితమే. అయితే, ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌తోపాటు, వెంకటేష్‌ కూడా నటిస్తాడన్నది తాజా ఖబర్‌. ప్రస్తుతానికైతే పవన్‌కళ్యాణ్‌ హీరోగా 'గోపాల గోపాల' ఫేం డాలీ దర్శకత్వంలో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిన విషయం విదితమే. 

ముందు ఎస్‌జె సూర్య దర్శకత్వంలో సినిమా అనుకున్న పవన్‌, కొన్ని కారణాలతో ఎస్‌జె సూర్యని పక్కన పెట్టి, డాలీని రంగంలోకి దించాడు. ఈలోగా, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేసేందుకు పవన్‌కళ్యాణ్‌ తొందరపడినా, మళ్ళీ డాలీతోనే సినిమాని ఫైనల్‌ చేశాడు. డాలీకి 'గోపాల గోపాల' సినిమా టైమ్‌లోనే 'ఇంకో సినిమా చేద్దాం..' అని హామీ ఇచ్చిన పవన్‌, ఆ సమయంలోనే వెంకటేష్‌తో కలిసి ఇంకో సినిమా చేద్దామనుకున్నాడట. 

వెంకటేష్‌తో మళ్ళీ సినిమా చేయాలనే తన ఆలోచనని, తన స్నేహితుడు త్రివిక్రమ్‌తో పవన్‌ పంచుకోవడం, వెంకీ కామెడీ టైమింగ్‌కి వీరాభిమాని అయిన త్రివిక్రమ్‌.. వెంకీ - పవన్‌తో కలిసి సినిమా చేయడానికి అంగీకరించడం జరిగిపోయాయట. అన్నీ కుదిరితే, అతి త్వరలోనే ఈ కాంబినేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?