పవన్ కళ్యాణ్ తన పంథా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. అజ్ఞాతవాసి ఫలితం చూసినవారిలో చాలా మందికి కలుగుతున్న అభిప్రాయం ఇది. రాజకీయం, సినిమా రెండు పడవలు. ఈ రెండు పడవల ప్రయాణం సక్సెసఫుల్ గా ఇంతవరకు ఎవ్వరూ చేయలేకపోయారు. పాలిటిక్స్ లోకి దిగక ముందు వచ్చిన 'అత్తారింటికి దారేది' తరువాత ఇంతవరకూ హిట్ పడలేదు.
పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత రిలీజ్ అయిన 4సినిమాలూ ప్లాప్ అయ్యాయి. నిజం చెప్పాలంటే సర్దార్, అజ్ఞాతవాసి.. ఈ రెండూ డిజాస్టర్స్ అవ్వాల్సిన సినిమాలు కాదు. కనీసం ఏవరేజ్ టాక్ తో బైట పడాల్సినవే. కానీ రాజకీయాల వల్ల చాలామంది అభిమానులను దూరం చేసుకోవాల్సి వచ్చింది. దాని పరిణామమే ఈ ఫ్లాప్స్.
సాధారణంగా సినిమా స్టార్లకు రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానులుంటారు. పవన్ కీ అంతే.. కానీ ఎప్పుడైతే అతని స్టాండ్ అర్థం అయ్యిందో రెండు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
1. అవతలి పార్టీ లోని పవన్ అభిమానులు దూరం కావడం. 2. నెగెటివ్ టాక్ శరవేగంగా స్ప్రెడ్ కావడం.
విచిత్రమేమిటంటే ఈ టాక్ స్ప్రెడ్ చేసినవాళ్ళల్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయం రాజకీయమే… సినిమాలు సినిమాలే..
పనిలో పనిగా పవన్ కళ్యాణ్ అభిమానులో కొందరు అతి చేయడం, విమర్శిస్తే అసభ్యంగా తిట్టడం, చంపేస్తామనడం పవర్ స్టార్ కి అపకారమే చేస్తున్నాయనే చెప్పాలి.
సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాలు కలిపి దాదాపు 300కోట్ల వరకు అమ్మితే అందులో సగం కూడా కలెక్ట్ కాక బయ్యర్లు, థియేటర్ యజమానులు భారీగా నష్టపోయారు. సినిమా అనేది ఒక వ్యాపారం. రాజకీయాలు కొంత, సినిమాలు కొంత అంటే నష్టాలు తప్పవు.
పవన్ ఇప్పుడు సీరియస్ గా ఈ పరిస్థితిని విశ్లేషించుకోవాలి. రెండు పడవల ప్రయాణమా… ఏదో ఒక దానినే ఫుల్ టైమ్ గా తీసుకోవడమా…