పవన్ వైఫ్ ఎందుకు వెళ్లలేదంటే?

మెగా డాటర్ నీహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ హాజరయ్యారు. ఒక్కరు తప్ప. అది ఎవరో కాదు పవన్ సతీమణి. ఆమె ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చిరంజీవి,…

మెగా డాటర్ నీహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ హాజరయ్యారు. ఒక్కరు తప్ప. అది ఎవరో కాదు పవన్ సతీమణి. ఆమె ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చిరంజీవి, నాగబాబు ఫ్యామిలీల్లో చిన్న చిన్న అకేషన్లకు కూడా ఆమె హాజరైన సందర్భాలు వున్నాయి.

అసలు పవన్ భార్య ఫొటోలు ఏవైనా బయటకు వచ్చాయి అంటే మెగా ఫ్యామిలీలో జరిగిన ఫంక్షన్ల సందర్భంగానే. అలాంటిది కీలకమైన ఈవెంట్ కు ఆమె హాజరు కాకపోవడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో లేరని, రష్యా వెళ్లారని అందుకే హాజరు కాలేదని తెలుస్తోంది. పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లారని వినిపిస్తోంది. పవన్ భార్యకు ఓ అలవాటు వుందని, ప్రతి ఏటా డిసెంబర్ లో రష్యా వెళ్లి క్రిస్మస్ వేడుకలు చేసుకుని, సరిగ్గా క్రిస్మస్ టైమ్ కు హైదరాబాద్ వచ్చేస్తారట.

ఆ విధంగానే ఈ సారి వెళ్లి వుంటారని తెలుస్తోంది.మొత్తం మీద టోటల్ కొణిదెల ఫ్యామిలీ పిక్స్ లో పవన్ భార్య, ఆమె పిల్లల పిక్స్ మిస్ అయ్యాయి.