నెట్ ఫ్లిక్స్ సౌత్ టాప్ హిట్ ఆ సినిమానే

థియేటర్ లో విడుదలైన సినిమా హిట్ నా ఫట్ నా అన్నది కలెక్షన్లు చెబుతాయి. శాటిలైట్ లో విడుదలయిన సినిమా టీఆర్పీ బట్టి హిట్ నా ఫట్ నా అన్నది తెలుస్తుంది. కానీ ఓటిటి…

థియేటర్ లో విడుదలైన సినిమా హిట్ నా ఫట్ నా అన్నది కలెక్షన్లు చెబుతాయి. శాటిలైట్ లో విడుదలయిన సినిమా టీఆర్పీ బట్టి హిట్ నా ఫట్ నా అన్నది తెలుస్తుంది. కానీ ఓటిటి లో విడుదలయిన సినిమాను ఎంత మంది చూసారు అన్నది ఎవ్వరికీ తెలియదు.

కేవలం ఆ సినిమా నిర్మాతకు కొంత వరకు తెలియవచ్చు. ఓటిటి లు స్వయంగా ప్రకటించవు. 2020 లో సౌత్ నుంచి తమ ఓటిటి లో విడుదలై, టాప్ హిట్ లు గా నిలిచిన సినిమాల పేర్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు గాను బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ అల వైకుంఠపురములో టాప్ హిట్ గా నిలిచింది. తరువాత స్థానంలో దుల్కర్ సల్మాన్-రీతూ వర్మ నటించిన కనులు కనులను దోచాయంటే మలయాళ వెర్షన్ వుంది. మూడో స్థానంలో మలయాళ సినిమా కప్పెల వుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు కూడా. 

మరో తెలుగు సినిమా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య కూడా టాప్ టెన్ లో చోటు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటిటిలో విడుదలయింది.