ఎక్స్ క్లూజివ్ -పవన్ కళ్యాణ్-వైష్ణవ్ తేజ్ కాంబో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే అయిదు సినిమాలు వున్నాయి. వీటిలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయింది. డైరక్టర్ క్రిష్ చేసే హరి హర వీరమల్లు షూట్ లో వుంది.  Advertisement…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే అయిదు సినిమాలు వున్నాయి. వీటిలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయింది. డైరక్టర్ క్రిష్ చేసే హరి హర వీరమల్లు షూట్ లో వుంది. 

మాస్ డైరక్టర్ హరీష్ శంకర్ చేయబోయే భవదీయుడు భగత్ సింగ్ స్టార్ట్ చేయాలి. ఈ రెండూ వుండగానే సురేందర్ రెడ్డి-రామ్ తాళ్లూరి-జి స్టూడియోస్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయివుంది.

ఇవన్నీ ఇలా వుండగానే సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని డైరక్షన్ లో ఓ సినిమా ఓకె చేసారు. దీనికి త్రివిక్రమ్ మాటలు అందిస్తారు. ఇది కాక మరో సినిమా కూడా చేయబోతున్నారు. 

ఓ మేనల్లుడు సాయి ధరమ్ తో సినిమా ఓకె చేసిన ఆయనే మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఇంకో సినిమా చేయబోతున్నారు.

దీనికి దర్శకుడు ఎవరు? నిర్మాణం ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి వుంది. చేయడం అయితే ఫిక్స్. అంటే వకీల్ సాబ్..కలుపుకుని కమ్ బ్యాక్ తరువాత పవన్ చేసే సినిమాల సంఖ్య ఇప్పటికి 7 కు చేరింది.