ఆయనో పెద్ద హీరో. టాలీవుడ్ లోని క్రేజీ హీరోల్లో ఒకరు. ఈ మధ్యనే ఓ పెద్ద హిట్ కొట్టారు. ఆ తరువాత సినిమా స్టార్ట్ కావాల్సి వుంది. కానీ కాస్త టైమ్ వుంది.
కానీ ఈలోగా నిత్యం పార్టీలే పార్టీలంట. అయితే అలా అని భారీ పార్టీలేం ఇవ్వడం లేదు. మందు కొట్డడానికి ఓ రీజన్ వుండాలి. లేదా కనీసం ఓ కంపెనీ వుండాలి.
అలా నిత్యం తనతో పాటు మరో రెండు గ్లాస్ మేట్లు వుండేలా చూసుకుంటున్నారట. అయితే ఇలా నిత్యం మందు కొడితే ఫిజిక్ పాడవుతుంది. హెల్త్ పాడవుతుంది అని దగ్గర వాళ్లు టెన్షన్ పడుతున్నారని బోగట్టా. కానీ వినే మూడ్ లో ఆ హీరో లేరని తెలుస్తోంది.
ఫ్రెండ్స్ నో సన్నిహితులనో పక్కన వుండాల్సిందే. మందు కాస్త ఎక్కువైతే బయటకు వచ్చే ఫ్రస్టేషన్ ను తట్టుకోవాల్సిందే. ఆ ఫ్రస్టేషన్ లో వచ్చే మాటలు వినాల్సిందేనంట. ఈ వ్యవహారం గురించి టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో అనేక కబుర్లు గుప్పు మంటున్నాయి.