టాలీవుడ్ కు చెందిన పెద్ద కుటుంబాలు ఓ దాంట్లో ఆధిపత్య పోరు ప్రారంభమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ కుటుంబ వ్యాపారాల్లో చురుగ్గా వున్న ఇద్దరిని కాదని, కొత్తగా అడుగు పెట్టిన కోడలు వ్యవహారాలు చక్కదిద్దడం ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఆ కుటుంబానికి వున్న కీలక వ్యాపార నిర్వహణను మెల్లగా తన చేతుల్లోకి తీసుకోవడం అన్నది అసలు టార్గెట్ అని, అంతకన్నా ముందుగా ఆ కుటుంబం నిర్మించే సినిమా నిర్మాణ బాధ్యతల కోసం తన మనిషిని నియమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో అంతటి కీలక బాధ్యతలు అందడం ఇది తొలిసారి. ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ఇలాంటి బాధ్యతలు చూస్తున్న బాగా సీనియర్ వ్యక్తిని పక్కన పెట్టారని తెలుస్తోంది.
ఇప్పుడు అక్కడితో ఆగకుండా మిగిలిన వ్యాపారబాధ్యతలకు కూడా టేకోవర్ చేసే దిశగా పావులు కదులుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి సమ్ థింగ్..సమ్ థింగ్..అని గుసగుసలు మాత్రం వినిపిస్తోంది.