Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పెళ్లానికి దొరికేసిన 'హీరో'!

పెళ్లానికి దొరికేసిన 'హీరో'!

ఎవరు ఎన్ని వేషాలు అయినా వేయొచ్చు. కానీ పెళ్లాలకు దొరకకుండా చూసుకోవడం ముఖ్యం. సినిమా జనాల్లో చాలా మందికి ఏదో ఒక అలవాటు వుంటుంది. 

మందు, పేకాట లాంటివి పెద్దగా సమస్య కాదు. కానీ 'అదనపు సంబంధాలు' వుంటేనే కష్టం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం ఉప్పు అందించిన పెళ్లాలు అంత సులువుగా ఊరుకోరు. రాజీ పడరు.

టాలీవుడ్ లో ఓ చిన్న హీరో ఇలాగే పెళ్లానికి దొరికిపోయినట్లు బోగట్టా. అయితే ఇతగాడి 'అదనపు ముచ్చట' వేరే తరహా. పెళ్లాం, పిల్లలు వుండి కూడా, కాస్త 'స్వజన సంపర్కం' అంటే ముచ్చట అని తెలుస్తోంది. 

తన జిమ్ ఇన్ స్ట్రక్టర్ తోనో, అలాంటి సన్నిహితుడితోనో, సన్నిహితంగా వుంటూ పెళ్లానికి దొరికేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆమె ఇతగాడిని సాంతం దూరం పెట్టే ప్రయత్నంలో వుందట. 

పెద్దింటి అమ్మాయి కావడం, దేనికీ లోటు లేకపోవడంతో, ఇలాంటి వెకిలి అలవాటు వున్న వాడు తనకు వద్దు అంటోందట. ఏమిటో అన్నీ వున్నా తిన్నగా వుండకుండా లైఫ్ కి ఇలాంటి టర్నింగ్ లు ఇచ్చుకుంటారు కొందరు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?