‘‘పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగతం. అది ఎంత తక్కువ మందికి వీలైతే అంత తక్కువ మంది మధ్య జరగాలి’’ అంటోంది తాజా అందాల తాప్సీ. సెలబ్రిటీల జీవితాల్లో పర్సనల్- పబ్లిక్ అనే అంశాల మధ్య గీత చాలా సన్నగా మారిపోతుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉంటుందంటోంది.
ముందస్తుగా పక్కా ప్లానింగ్‌తో తన పెళ్లి వేదికని అందంగా తయారు చేస్తానని, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తానని, అయితే అత్యంత సన్నిహితులకు, అయినవారికి మాత్రమే ఈ వేడుకలో ప్రవేశం ఉంటుందని చెపుతోంది. తాప్సీ మాటలు వింటుంటే అప్పుడే పెళ్లి మీదకి మనసు పోయిందేమో అనిపిస్తోంది కదా… అయితే పెళ్లి మాత్రం మరి కొన్నేళ్ల తర్వాతే అంటోంది.
మరో విషయం…తను ఇటీవలే తన చెల్లెలు, క్లోజ్ ఫ్రెండ్ ఫరాలతో కలిసి ఓ వెడ్డింగ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా ప్రారంభించింది. రన్నింగ్ షాదీ డాట్‌కామ్ సినిమా చేస్తున్న సమయంలో తనకీ ఆలోచన వచ్చిందట.