పాదాభివందనం అంటే మహా ప్రీతి రాజకీయనాయకులకు, సినిమా వాళ్లకు. పెట్టకపోతే, తల మీద చేయి వేసి వంచి మరీ పెట్టించుకుంటారని ఓ డైరక్టర్ మీద సెటైర్ కూడా వేస్తుంటారు. ఇప్పుడు ఈ పాదాభివందనమే ముగ్గురు పెద్దతలకాయలకు కోపం తెప్పించింది. వాళ్లకు పాదాభివందనం చేయకపోగా, వాళ్ల ముందే మరొకరి కాళ్లకు మొక్కడం అంటే అంతే కదా.
ఇంతకీ ఈ పని చేసింది నిర్మాత బండ్ల గణేష్. టీవీ -9 టీఎస్ఆర్ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి వేదికపైకి వచ్చాడు బండ్ల. అక్కడ బాలయ్య బాబు, చిరంజీవి, మోహన్ బాబు, సుబ్బరామిరెడ్డి ఇంకా ఒకరిద్దరు వున్నారు. బండ్ల మరి కావాలని చేసాడో, అనుకోకుండా చేసాడో, తిన్నగా వెళ్లి చిరంజీవి కాళ్లకు దండం పెట్టాడు.
అసలే గీస్తే కారేంత గోరోజనం వుంటుంది సినిమా జనాలకు. పైగా లెజెండ్..లెజండ్రీలు బాలయ్య, మోహన్ బాబు. అక్కడిక్కడే బాలయ్య తాను బండ్లకు అందించాల్సిన అవార్డు ను వేరేవాళ్లకు ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు.
అసలు ఇంతకీ బండ్ల వ్యవహారమేమిటి? ఆ మధ్య టెంపర్ విడుదలప్పుడు తనను మెగాస్టార్ మనిషిగా ముద్ర వేసే ప్రయత్నం జరిగిందని ఆయనే చెప్పాడు. అది ఎన్టీఆర్ కు కోపం తెప్పించింది. ఇప్పుడు అదే ఫ్యామిలీ జనాల ముందు మెగాస్టార్ కు సాగిల పడ్డాడు. ఎంత మెగాస్టార్ పై అభిమానం కుప్పలు తెప్పలుగా వున్నా, మొక్కుబడికైనా మిగిలిన వాళ్లకు కూడా ఓ దండం పడేస్తే, ఎప్పటికైనా పనికి వచ్చేది కదా? ఇప్పుడు ఇది డిస్కషన్ పాయింటై కూర్చుంది ఇండస్ట్రీలో.