ఏ పేరంటానికైనా, వేడుకకైనా భార్యా భర్తా కలిసి రండంటూ ఆహ్వానించడం తెలిసిందే. అయితే పెళ్లి కాకుండా కాపురం చేస్తున్న జంటలని ఏరి కోరి ఇలా ఆహ్వానిస్తోంది ఓ సంస్త. ఈ విచిత్ర ఆహ్వానానికి కారణం…ఓ చిత్రమే. వివరాలివి… సహజీవనం లేదా లివిన్ రిలేషన్ షిప్ అనే సరికొత్త సంప్రదాయం ఆధునిక భారతీయ సమాజంలో వేళ్లూనుకుంటున్న నేపధ్యంలో వస్తున్న హిందీ సినిమా. కట్టీ బట్టీ.
ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్‌లు జంటగా రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ లివిన్ రిలేషన్ షిప్ అంశం మీద రూపొందింది. ఈ సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా నిర్వహించాలని అనుకున్న నిర్మాతలు… సినిమా థీమ్‌కు తగ్గట్టుగా పెళ్లి కాకుండానే ప్రస్తుతం లివిన్ బంధంలో ఉన్న యువతీ యవకులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ ప్రమోషన్‌లో పాల్గొనే లివిన్ జంటలను తగు రీతిన స్వాగతించి, వారికి తమ అభిమాన నటీనటులతో ముచ్చటించే అవకాశాన్ని కలిపిస్తున్నారు.
అలాంటి జంటల్ని ఆకట్టుకోవడం కోసం పలు రకాల కాంటెస్ట్ లు, యాక్టివిటీస్ చేపడుతున్నారు. నికిల్ అద్వాని ఈ సినిమా దర్శకుడు. ఈ ఏడాది సెప్టెంబరు 18న సినిమా విడుదల అవుతుంది. ఈ లోగా ఎంత మంది లివిన్ కపుల్ ఈ వెల్‌కమ్‌ని అందుకుంటారో వేచి చూడాలి.