పెళ్లిపై ఆ ఇద్దరు టైట్ లిప్డ్

ఈ మధ్యకాలంలో భయంకరంగా వార్తల్లో వినిపించిన అంశం నాగ్ చైతన్య-సమంతల పెళ్లి సంగతే. సాధారణంగా ఇలాంటివి రూమర్లుగా వినిపిస్తాయి..కనిపిస్తాయి. కానీ ఈ పెళ్లి వార్త మాత్రం దాదాపు పక్కా అన్నంతగా కనిపించింది. అయితే ఇప్పుడు…

ఈ మధ్యకాలంలో భయంకరంగా వార్తల్లో వినిపించిన అంశం నాగ్ చైతన్య-సమంతల పెళ్లి సంగతే. సాధారణంగా ఇలాంటివి రూమర్లుగా వినిపిస్తాయి..కనిపిస్తాయి. కానీ ఈ పెళ్లి వార్త మాత్రం దాదాపు పక్కా అన్నంతగా కనిపించింది. అయితే ఇప్పుడు ఉన్నట్లుంది ఈ విషయం కాస్త వెనక్కు వెళ్లినట్లు కనిపిస్తోంది. 

ఇటీవల సమంత ట్విట్టర్ లో తన చిత్తానికి ప్రశ్నలు సమాధానాలు అంటూ చెలరేగిన తరువాతనే ఈ కొత్త పరిణామం సంభవించినట్లు తెలుస్తోంది. ఆది నుంచీ నాగ్ చైతన్య సైలెంట్ గానే వున్నాడు. కానీ సమంతనే తెగ హడావుడి చేస్తూ, ఫీలర్లకు చాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ వ్యవహారానికి తాళం పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరి సమంతకు ఎవరి నుంచి సలహా సూచనలు వచ్చాయో?

చైతూ ది బెస్ట్

పెళ్లి రూమర్ల విషయంలో సమంత కన్నా చైతన్య చాలా పద్దతిగా వున్నట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఈ పెళ్లి కబుర్లు వినిపించడం ప్రారంభించిన తరువాత చైతన్యతో దగ్గరగా వుండడం సంభవించిన వాళ్లో, సన్నిహితులో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్ లో ఈ పెళ్లి వ్యవహారంపై క్వశ్చను చేసారట. కానీ ఒక్కరంటే ఒక్కరికి కూడా చైతన్య దగ్గర నుంచి ఆన్సరు రాలేదట. 

పైగా తనకు అమ్మ వైపు బంధుగణం ఎక్కువ వున్నా, కెరీర్, పెళ్లి ఇవన్నీ తండ్రి నాగార్జున ఇష్టాఇష్టాల మేరకే జరుగుతాయని క్లియర్ గా చెప్పేసాడట. అంతే కానీ, మళ్లీ అని, సమంత వ్యవహారం మాత్రం పొరపాటున కూడా ప్రస్తావించలేదట. ఏమయినా నాగ్ ట్రయినింగ్ బాగానే వుందనుకోవాలి.