పెళ్లికి వెళ్లడమూ ఎన్టీఆర్ తప్పేనా?

కళ్యాణ్ రామ్ సినిమా నా నువ్వే ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ రాలేదు. కానీ మొన్నటికి మొన్న సినిమా ఓపెనింగ్ కు వచ్చాడుగా. అయినా సరే, ఈ ఫంక్షన్ కు రాలేదు అంటే అన్నదమ్ముల…

కళ్యాణ్ రామ్ సినిమా నా నువ్వే ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ రాలేదు. కానీ మొన్నటికి మొన్న సినిమా ఓపెనింగ్ కు వచ్చాడుగా. అయినా సరే, ఈ ఫంక్షన్ కు రాలేదు అంటే అన్నదమ్ముల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. విడిపోయారేమో? ఇదీ గుసగుస.

కానీ అసలు విషయం వేరు. నందమూరి హరికృష్ణ ఫ్యామిలీతో మాంచి సంబంధాలున్న విశాఖ దేవీసీఫుడ్స్ సంస్థ అధినేత ఇంట్లో శుభకార్యం. తప్పనిసరిగా హరికృష్ణ ఫ్యామిలీ నుంచి ఒకరు వెళ్లాలి. పైగా ఎన్టీఆర్ కు కూడా మాంచి స్నేహం వుంది. దాంతో ఎన్టీఆర్ అటు వెళ్లక తప్పలేదు.

కానీ అదే టైమ్ కు ఇక్కడ ఆడియో ఫంక్షన్. దాంతో రాలేదు. అదిగో రాలేదు. ఇదిగో విడిపోయారు అంటూ గుసగుసలు. నిజానికి గుసగుసలు దేనికైనా వినిపిస్తాయి. కానీ కాస్త పక్కా చేసుకుని రీసౌండ్ చేయాలి కానీ, అవే నిజం అనేసుకుంటే ఎలా అంటున్నాయి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ సన్నిహిత వర్గాలు.