మహానటి 11న.. అభిమన్యుడు 17న

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలంటే సినిమాలకు కాస్త కష్టమే. ఇక్కడి సినిమాలకు అక్కడ థియేటర్లు దొరకవు. అక్కడి సినిమాలకు ఇక్కడ డేట్లు కుదరవు. రెండూ చూసుకోవాలంటే, ఎప్పుడో ఎక్కడో సెట్ అవుతుంది.…

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలంటే సినిమాలకు కాస్త కష్టమే. ఇక్కడి సినిమాలకు అక్కడ థియేటర్లు దొరకవు. అక్కడి సినిమాలకు ఇక్కడ డేట్లు కుదరవు. రెండూ చూసుకోవాలంటే, ఎప్పుడో ఎక్కడో సెట్ అవుతుంది. దాంతో ఇప్పుడు వేరు వేరు డేట్ లు చూసుకోవాల్సి వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్ సీస్ లో ఈ నెల 9న విడుదలవుతోంది మహానటి సినిమా. మహానటి సావిత్రి, తమిళులకు బాగా పరిచయం అయిన జెమినీ గణేషన్ ల కథ. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా విడుదల చేస్తున్నారు. కానీ 9న కాదు. 11న విడుదల చేస్తున్నారు. సాధారణంగా వారం మధ్యలో సినిమాలు విడుదల కావు. ఏదో జగదేక వీరుడు సెంటిమెంట్ తో మహానటి సినిమాను 9న బుదవారం విడుదల చేస్తున్నారు. కానీ తమిళనాట మాత్రం శుక్రవారమే 11న విడుదల చేస్తున్నారు.

ఇదిలా వుంటే విశాల్ నటించిన ఇరుంబు తరై సినిమా ఈ నెల 11న తమిళంలో విడుదలవుతోంది. ఇదే సినిమా తెలుగు వెర్షన్ కూడా వుంది. అభిమన్యుడు. కానీ ఇది మాత్రం 11న విడుదల కావడం లేదు. ఎందుకంటే మార్కెట్ లో రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య, మహానటి, మెహబూబా సినిమాలు వుంటాయి 11 నాటికి. మరి అదే రోజు ఇదీ విడుదల అంటే థియేటర్లు కష్టం .ఓపెనింగ్స్ కష్టం.

అందుకే అభిమన్యుడు సినిమాను 17న విడుదలచేద్దామని అనుకుంటున్నారు. 18న విజయ్ దేవరకొండ టాక్సీవాలా విడుదల వుంటుంది. ఆ విధంగా మహానటి, అభిమన్యుడు ఇక్కడో డేట్ కు, అక్కడో డేట్ కు విడుదలవుతున్నాయి.