cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పిల్లలపై ఉపాసన క్లారిటీ

పిల్లలపై ఉపాసన క్లారిటీ

సెలబ్రిటీల జీవితాలు తెరచిన పుస్తకాలే. ప్రజల అందరి దృష్టీ అటే వుంటుంది. పదేళ్ల సంసార జీవితం రామ్ చరణ్..ఉపాసన లది. కానీ ఇప్పటి వరకు పిల్లలు లేరు. కారణం వాళ్లకే తెలియాలి. 

గతంలో ఇదే విషయం మెగాస్టార్ తో ప్రస్తావించినపుడు కూడా తాను, సురేఖ కూడా ఆ తరుణం కోసమే ఎదురుచూస్తున్నామని బదులిచ్చారు.

లేటెస్ట్ గా విదేశాల్లో జరిగిన సద్గురుతో ముఖాముఖి కార్యక్రమంలో ఉపాసన మాటలు వింటే పిల్లలు..పెంపకం వంటి విషయాల మీద ఉపాసన దంపతులకు అంత ఆసక్తి లేనట్లు అనిపిస్తోంది. 

సద్గురు జగ్గీవాస్ దేవ్ ను ఉపాసన్ ఓ ప్రశ్న అడిగారు. పిల్లలను కనడం అన్నదాని మీద ఆ ప్రశ్న వేసారు. దానికి సద్గురు సమాధానం ఇస్తూ, పిల్లలను కనగలిగే ఆరోగ్యం వుండి కూడా కనకుండా వుండిపోయేవారికి తాను అవార్డు ఇస్తానని అన్నారు. 

ప్రపంచంలో జనాభా పెరిగిపోతోందని, ఒకరి పాదాలపై మరొకరు పాదాలుంచేంత పరిస్థితి కనిపిస్తోందని ఆయన అన్నారు. తన అత్త, అమ్మలతో ఓసారి మిమ్మల్ని మాట్లాడిస్తానని ఉపాసన బదులివ్వడం విశేషం. దానికి తాను చాలా మంది అత్తలతో మాట్లాడానని సద్గురు చమత్కరించారు.

దీన్ని బట్టి చూస్తుంటే అత్త, అమ్మల నుంచి ఉపాసన పిల్లల కోసం వత్తిడి ఎదుర్కుంటోన్నట్లు అనుకోవాల్సి వస్తోంది. వారికి తాను సద్గురు చేత సమాధానం ఇప్పించాలని ఆమె అనుకున్నట్లు భావించాలి. 

పిల్లలు వద్దని అనుకునేవారు చాలా రేర్ గా వుంటారు. అందులోనూ వేలాది కోట్ల ఆస్తి పరులు తమకు వారసులు వుండాలని కచ్చితంగా అనుకుంటారు. మరి రామ్ చరణ్-ఉపాసన అందుకు భిన్నంగా ఎందుకు ఆలోచిస్తున్నారో? 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి