త్రివిక్రమ్ కథ చెప్పేసారు

మొత్తానికి ఓ అడుగు ముందుకు పడింది. మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి మార్గం సుగమం అయింది. దర్శకుడు త్రివిక్రమ్ నిన్నటికి నిన్న హీరో మహేష్ కు ఫైనల్ నెరేషన్ ఇచ్చేసారు.  Advertisement గతంలో…

మొత్తానికి ఓ అడుగు ముందుకు పడింది. మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి మార్గం సుగమం అయింది. దర్శకుడు త్రివిక్రమ్ నిన్నటికి నిన్న హీరో మహేష్ కు ఫైనల్ నెరేషన్ ఇచ్చేసారు. 

గతంలో లైన్ మాత్రం చెప్పిన త్రివిక్రమ్ ఇటీవల విదేశాల్లో ఒక నెరేషన్ ఇచ్చారు. కొన్ని కరెక్షన్స్, సూచనలు ఇవ్వడంతో, మళ్లీ ఫైనల్ టచప్ లు చేసారని తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం మహేష్ ఇండియాకు తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే నెరేషన్ కు సిద్దపడ్డారు. ఆదివారం సాయంత్రం త్రివిక్రమ్ నెరేషన్ ఇచ్చారు. మహేష్ స్పందన ఏమిటో ఇంకా తెలియాల్సి వుంది. అంతా ఓకె అయితే ఈ నెలాఖరు నుంచే సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. 

సినిమాకు అంతా రెడీగా వుంది. స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ అంతా ఫైనల్ అయిపోయింది. మెయిన్ స్టార్ కాస్ట్ డేట్ లు కూడా ఫ్లెక్సిబుల్ గా రెడీగా వున్నాయి.ఇక మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే తరువాయి.

బహుశా ఇక ఇప్పటి నుంచి త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్ మీదకు వెళ్లే అవకాశం వుంది. హారిక హాసిన బ్యానర్ మీద నిర్మించే ఈ సినిమా తరువాత మహేష్ తొలి పాన్ ఇండియా సినిమా అయిన రాజమౌళి ప్రాజెక్టు మీదకు వెళ్తారు.