పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు ఈ హీరో అభిమానులు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని.. ఆమెపై అనుచితంగా మాట్లాడటాన్ని వీళ్లు అలవాటుగా మార్చుకున్నట్టుగా ఉన్నారు. పవన్ కల్యాణ్ కు ఎక్కువ నష్టం చేసేది మరెవరో కాదు.. ఆయన అభిమానులే అనే విషయానికి రుజువుగా, మరోసారి రేణు విషయంలో వీళ్లు అనుచిత ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. దానికి ఆమె ట్విటర్ అకౌంట్ నే వేదికగా చేసుకొంటూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి పవన్ మాజీ భార్య భగ్గుమంది. తనను ఎందుకలా ప్రవర్తిస్తారు? అని అంటూ ఒక పవన్ కల్యాణ్ అభిమానిని కడిగేస్తూ.. అందరికీ గడ్డిపెట్టింది. ఈ మధ్య రేణుదేశాయ్ ట్విటర్లో ఒక కవిత పెట్టింది కదా.. దాని విషయంలోనూ పవన్ కల్యాణ్ అభిమానులు తెగ అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో మెసేజెస్ చేసినట్టుగా ఉన్నారు. వాటిపై స్పందిస్తూ విరుచుకుపడింది రేణుదేశాయ్.
రేణుదేశాయ్ పెట్టే పోస్టుల వల్ల పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు లక్ష్యం అవుతున్నాడు.. అనేది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బాధ. ఈ బాధతో ఆమెను లక్ష్యంగా చేసుకొంటున్నారు వీళ్లు. రేణుదేశాయ్ అవగాహన రాహిత్యంతో ఏవో పోస్టులు పెడుతుందని, వాటి వల్ల పవన్ కల్యాణ్ కు నష్టం జరుగుతోందని.. ఆమె కామ్ గా ఉండాలని వీళ్లు ఆమెకు హితబోధలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వీళ్ల మెసేజ్ ఒకదాన్ని అందరికీ చూపిస్తూ రేణు దేశాయ్ విరుచుకుపడింది.
తను ఏదో పోస్టు పెడితే.. పవన్ కల్యాణ్ ఎలా లక్ష్యం అవుతాడు? ఎందుకు లక్ష్యం అవుతాడు? మీలాంటి వాళ్లు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? అని అంటూ సూటిగా అడిగింది.
పవన్ అభిమాని ట్వీట్
“మీ (రేణుదేశాయ్) వల్లనే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ గా మారుతున్నారు. ప్రతిసారి హాఫ్-నాలెడ్జ్ తో మీరు తెరపైకొస్తున్నారు. మీరేదో చెబుతుంటారు. మీడియా దాన్నే హైలైట్ చేస్తుంది. దయచేసి మీ పని మీరు చూసుకోండి. పవన్ కల్యాణ్ గురించి ఏమీ షేర్ చేయొద్దు”
రేణు దేశాయ్ ఘాటు సమాధానం
“అవునా.. అంత సీరియస్సా? నేను పెట్టిన ఓ చిన్న పాట కారణంగా పవన్ రాజకీయంగా ఎలా టార్గెట్ అవుతారు? ఇది సాధ్యమేనా? ముందు మీ పనేదో మీరు చూసుకోండి. ప్రతిసారి నా సోషల్ మీడియా పేజ్ లోకి రావడం మానుకోండి. నాకు నచ్చింది నేను పోస్ట్ చేస్తాను. నాపై విరుచుకుపడాలనుకుంటే అది మీఇష్టం. నేను పెట్టిన ఈ ట్వీట్ పై కూడా ఇష్యూ చేయండి.”
ఇలా ఫస్ట్ టైం ఓ పవన్ అభిమానిపై రేణుదేశాయ్ ఫైర్ అయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె పెట్టిన ట్వీట్ పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు రేణును సమర్థిస్తుంటే.. పవన్ అభిమానులంతా మూకుమ్మడిగా మరోసారి ఆమెపై విరుచుకుపడుతున్నారు. తన మానాన తనను వదిలేయాలని.. తనను సోషల్ మీడియాలో వెంటాడటం మానేయాలని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చరిచి చెప్పింది రేణు. మరి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఇప్పుడైనా అర్థం అవుతుందా?