మళ్లీ మరోసారి అదే కాంబినేషన్!

జిల్ సినిమా గోపీచంద్ కు ఓ మంచి సినిమా. హిట్.. యావరేజ్ అన్న సంగతి పక్కన పెడితే మంచి స్టయిలిష్ సినిమా అనే పేరు వచ్చింది. దర్శకుడు రాధాకృష్ణ కు ప్రభాస్ తో రాధేశ్యామ్…

జిల్ సినిమా గోపీచంద్ కు ఓ మంచి సినిమా. హిట్.. యావరేజ్ అన్న సంగతి పక్కన పెడితే మంచి స్టయిలిష్ సినిమా అనే పేరు వచ్చింది. దర్శకుడు రాధాకృష్ణ కు ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా ఛాన్స్ వచ్చింది. తరువాత రాధాకృష్ణ అలాగే యువి సంస్థలో వుండిపోయారు.

సరైన సినిమా ఏదీ స్టార్ కాలేదు. కానీ ఇప్పుడు టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. యువి సంస్థనే మరో సినిమా ప్లాన్ చేస్తోంది. జిల్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని చూస్తోంది.

అటు గోపీచంద్, ఇటు రాధాకృష్ణ ఇద్దరూ యువి సంస్థకు సన్నిహితులే. అందుకే వారితో సినిమా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం కథ చర్చలు సాగుతున్నాయి.సరైన స్క్రిప్ట్ లాక్ అయితే సినిమా సెట్ మీదకు వెళ్తుంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్లతో విశ్వం సినిమా చేస్తున్నారు. ఇది విడుదలకు రెడీ అవుతోంది.

గోపీచంద్ హిట్ అన్నది చూసి చాలా సినిమాల కాలం అవుతోంది, ఏళ్లు గడుస్తున్నాయి. అదృష్ణం కొద్దీ సినిమా మీద సినిమా వస్తూనే వుంది. కానీ హిట్ మాత్రం రావడం లేదు. రాధాకృష్ణ పట్టుదలగా వర్క్ చేసి లోటు తీరుస్తారేమో?

7 Replies to “మళ్లీ మరోసారి అదే కాంబినేషన్!”

Comments are closed.