చేతిలో త్రిశూలం.. మెగా పూనకాలు

హ్యాండిల్ చేయలేనంత స్టార్ డమ్ దర్శకుడి ఎదురుగా ఉన్నప్పుడు ఆదుకునే ఏకైక జానర్ ఫాంటసీ. ఈ జానర్ లో కథ ఎంత హీరోయిజం అయినా తీసుకుంటుంది, ఎంత పెద్ద స్టార్ డమ్ నైనా అద్భుతంగా…

హ్యాండిల్ చేయలేనంత స్టార్ డమ్ దర్శకుడి ఎదురుగా ఉన్నప్పుడు ఆదుకునే ఏకైక జానర్ ఫాంటసీ. ఈ జానర్ లో కథ ఎంత హీరోయిజం అయినా తీసుకుంటుంది, ఎంత పెద్ద స్టార్ డమ్ నైనా అద్భుతంగా కథలో ఒదిగేలా చేస్తుంది. అలాంటి కథ దశాబ్దాల తర్వాత చిరంజీవికి దొరికింది. అదే విశ్వంభర.

పంచభూతాల కాన్సెప్ట్ తో, దైవ భక్తి, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో, ఊహకందని ప్రపంచాల్ని టచ్ చేస్తూ సాగే కథతో విశ్వంభర వస్తోందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమా నుంచి ఊహించని పోస్టర్ వచ్చింది.

త్రిశూలం పట్టిన చిరంజీవి లుక్ తో విశ్వంభర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. త్రిశూలం పట్టిన వెంటనే ఏదో శక్తి చిరంజీవిని ఆవహిస్తున్నట్టుండే లుక్ చూడగానే ఆకట్టుకుంది. మెగాభిమానులకు ఇది సరైన బర్త్ డే గిఫ్ట్.

వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది విశ్వంభర సినిమా. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అషికా రంగనాధ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదలవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.

6 Replies to “చేతిలో త్రిశూలం.. మెగా పూనకాలు”

Comments are closed.