రాజకీయ నాయకులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మాట్లాడుతుంటారు. ఒక్కోసారి వాళ్ళ మాటలకు, చేతలకు లాజిక్ ఉండదు. ఇప్పుడు కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రవర్తన అలాగే ఉంది. ఆయన వరుసగా ఆలయాల పర్యటన మొదలుపెట్టాడు.
ఆయన ప్రస్తుతం అధికారం లేకుండా ఖాళీగా ఉన్నాడు కాబట్టి పుణ్యం సంపాదించుకోవడానికో లేదా కాలక్షేపం కోసమో పుణ్య క్షేత్రాల సందర్శన చేయడంలేదు. దాని వెనుక మంచి ఉద్దేశం ఉందట ! ఏమిటది అంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పాపానికి పరిహారంగా అంటే దేవుళ్లను క్షమాపణ కోరడానికి అనుకోండి హరీష్ రావు ఆలయాలను దర్శించాలని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరరసింహ స్వామిని ముందుగా దర్శించుకుంటాడు. అక్కడ ప్రత్యేక ప్రత్యేక పూజలు చేస్తాడు. ఆ తరువాత రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ పాపం చేశాడో ఆయా ప్రాంతాల్లోని దేవుడి గుడులకు హరీష్ రావు వెళతాడు. ఇంతకూ రేవంత్ రెడ్డి ఏం పాపం చేశాడు?
రాష్ట్రంలోని రైతులందరికీ ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తానని చాలామంది దేవుళ్ళ సాక్షిగా చెప్పాడు. కానీ ఆ పని చేయకుండా మాట తప్పాడు. రుణ మాఫీ చేస్తానని చాలామంది దేవుళ్ళ పైన ఒట్లు కూడా పెట్టాడు. అంటే దేవుళ్ళ పట్ల పాపం చేశాడు. అంటే తప్పు చేశాడు. నేరం చేశాడు. సీఎం తప్పు చేశాడు కాబట్టి హరీష్ రావు దేవుళ్లను క్షమాపణ అడుగుతాడు. ఇదో తరహా రాజకీయం.
రాజకీయానికి దేవుడి సెంటిమెంటు యాడ్ చేశాడు. రెండు లక్షల అప్పు ఉన్న రైతులకు కొన్ని నిబంధనలు పెట్టి దాని ప్రకారం ప్రభుత్వం రుణాలు మాఫీ చేసింది. సరే …యేవో కారణాలవల్ల కొందరికి రుణ మాఫీ కాలేదు. వాళ్లకు కూడా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ దీన్ని రాజకీయంగా గులాబీ పార్టీ వాడుకుంటోంది.
ఎలాంటి కండీషన్లు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తోంది. దీన్ని రేవంత్ మాట తప్పినట్లు ప్రచారం చేస్తోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మాత్రం కూడా చేయలేదన్న సంగతి హరీష్ రావుకు, కేటీఆర్ కు గుర్తు లేనట్లుగా ఉంది.
అసలు రుణ మాఫీ చేయడం సాధ్యం కాదని, ఆ పని చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేయడం, చెప్పిన ప్రకారం రుణ మాఫీ చేసి తీరుతానని, రాజీనామా లెటర్ సిద్ధంగా ఉంచుకోవాలని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇద్దరి మధ్య రకరకాల ట్విస్టులతో ఈ కథ కొంత కాలం నడిచింది.
సరే …మొత్తానికి రేవంత్ రెడ్డి మాఫీ చేశానని అనిపించి దాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ ప్రభుత్వాన్ని ప్రధానంగా రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని గులాబీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగమే హరీష్ రావు ఆలయాల సందర్శన అండ్ పరిహారం కోరడం.
Call boy jobs available 8341510897
B o k u vedavalu BRS ku kk a lu
endhuku gullu thiragadam… okka aggi pette ivvandi daridhram vadhilipoddhi
vc estanu 9380537747
దేవుడు/దేవాలయాల్లో ఈ రాజకీయ దరిద్రాలు మొదలు పెట్టడం సమంజసమా ?