Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్లే బాయ్ గా అఖిల్ అక్కినేని

ప్లే బాయ్ గా అఖిల్ అక్కినేని

రక్షకుడిగా తొలిసినిమాలో, ప్రేమికుడిగా మలి సినిమాలో కనిపించిన అఖిల్ అక్కినేని, ఇప్పుడు ప్లే బాయ్ గా కనిపించబోతున్నాడు. తొలిప్రేమ చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వెంకీ అట్లూరి తన మలి సినిమాను అఖిల్ తో చేస్తున్నాడు.  అన్న నాగ్ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరక్షన్ లో బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 21న లండన్ లో ప్రారంభమవుతోంది.

ఏకధాటిగా 40 రోజులు షూటింగ్ వుంటుంది. దీంతో సినిమా చాలా వరకు లండన్ లోనే షూట్ చేసినట్లు అవుతుంది. అందువల్ల చాలా వరకు స్టార్ కాస్ట్, యూనిట్ మొత్తం లండన్ వెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం థమన్ మూడు పాటలు ఇచ్చాడు. మిగిలిన వాటిపై వర్క్ జరుగుతోంది.

తొలి సినిమా తరువాత వెంకీ అట్లూరికి చాలా ఆఫర్లు పరుగెత్తుకు వచ్చాయి. కానీ మలి సినిమా కమిట్ మెంట్ కూడా బోగవిల్లి ప్రసాద్ కే వుంది. అందుకే అదే బ్యానర్ లో మలి సినిమా స్టార్ట్ చేసాడు. హలో సినిమా పరాజయం తరువాత సరైన ప్రాజెక్టు కోసం చూస్తున్న హీరో అఖిల్ ను ఓ ప్లే బాయ్ సెంట్రిక్ కథను చెప్పి వెంకీ అట్లూరి ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమా ఫైనల్ అయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?