ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ?

తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. ఇదొక్కటి తప్ప ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ లేదు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకున్నారనే విషయాన్ని మినహాయిస్తే.. ఇతర టెక్నీషియన్లు, హీరోయిన్లు…

తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. ఇదొక్కటి తప్ప ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ లేదు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకున్నారనే విషయాన్ని మినహాయిస్తే.. ఇతర టెక్నీషియన్లు, హీరోయిన్లు ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే ఎన్టీఆర్ సరసన నటించనున్న హీరోయిన్ పై ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటారనే గాసిప్ జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ సినిమా చేస్తున్న పూజా హెగ్డే.. తారక్-త్రివిక్రమ్ సినిమాలో నటించేందుకు దాదాపు అంగీకరించినట్టు తెలుస్తోంది. కాకపోతే ఒకటే సమస్య.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చే టైమ్ కే మహేష్-వంశీ పైడిపల్లి సినిమా కూడా ప్రారంభం అవుతుంది. ఆ మూవీలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ గా అనుకుంటున్నారు. కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయగలిగితే ఈ రెండు సినిమాలకు పూజా హెగ్డే సంతకం చేసే అవకాశాలున్నాయి. 

మరోవైపు త్రివిక్రమ్, తన జాగ్రత్తలో తను ఉన్నాడు. పూజా హెగ్డేతో పాటు అనుపమ పరమేశ్వరన్ ను కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ సరసన అనుపమ సెట్ అవుతుందా అనేది డౌట్. త్వరలోనే తారక్ హీరోయిన్ ఎవరనేది తేలిపోతుంది.