పూజాహెగ్డే కోరిక నెరవేర్చనున్న తమన్

కొన్నిరోజుల కిందటి మాట. మహర్షి ఫంక్షన్ లో పూజాహెగ్డే మాట్లాడుతూ.. తను పాటలు పాడతానని, దేవిశ్రీ ప్రసాద్ తనకు ఓ ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చింది. కచ్చితంగా పూజాతో పాట పాడిస్తానని దేవిశ్రీ…

కొన్నిరోజుల కిందటి మాట. మహర్షి ఫంక్షన్ లో పూజాహెగ్డే మాట్లాడుతూ.. తను పాటలు పాడతానని, దేవిశ్రీ ప్రసాద్ తనకు ఓ ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చింది. కచ్చితంగా పూజాతో పాట పాడిస్తానని దేవిశ్రీ ఆ సమయంలో మాటిచ్చాడు. ఇప్పుడు అంతకంటే ముందే ఆ అవకాశాన్ని వాడుకోబోతున్నాడు తమన్.

అవును.. దేవిశ్రీప్రసాద్ కంటే ముందే పూజాహెగ్డేతో పాట పాడించబోతున్నాడు తమన్. అల్లుఅర్జున్ కొత్త సినిమాలో ఓ పాటను పూజాతో పాడిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చాడు ఈ సంగీత దర్శకుడు. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్, తమన్ మధ్య ఈ మేటర్ పై డిస్కషన్ నడుస్తోంది.

మరోవైపు తమన్ మాత్రం పూజాతో కొన్ని లైన్స్ పాడించినట్టు తెలుస్తోంది. ఆ గొంతు ఓకే అనుకుంటే, పూర్తి పాటను పూజాతోనే పాడించాలని ఆలోచిస్తున్నారు. మ్యాగ్జిమమ్ త్రివిక్రమ్ దీనికి ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, ఇంతకుముందు పూజాతో పట్టుబట్టి డబ్బింగ్ చెప్పించిన ఘనత త్రివిక్రమ్ కే దక్కుతుంది. కాబట్టి, ఆమె పాట పాడతానంటే అభ్యంతరం చెప్పకపోవచ్చు.

పూజాహెగ్డే పాట పాడితే, బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు అది మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటికే కాస్టింగ్ పరంగా ఈ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు పూజా పాట కూడా యాడ్ అయితే అంచనాలు మరింత పెరుగుతాయి. 

పవనమా? ఋతుపవనమా? ఈ పవనమెటు?