Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూజ హెగ్డేకి ఇంకా హిట్‌ లేదు

పూజ హెగ్డేకి ఇంకా హిట్‌ లేదు

పూజ హెగ్డేకి ఆఫర్లకి లోటు లేదు, కుర్రకారులో ఆమె అంటే కిర్రెక్కిపోయే వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో వుంటారు. అయితే ఏదో సామెత చెప్పినట్టు అన్నీ వున్నా కానీ పూజని విజయలక్ష్మి మాత్రం వరించడం లేదు. బాలీవుడ్‌లో 'మొహంజుదారో' లాంటి భారీ చిత్రంలో నటించినా, తెలుగులో అగ్ర హీరోలయిన అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌తో నటించినా ఇంకా పూజ ఖాతాలో హిట్‌ నమోదు కాలేదు.

డిజె, అరవింద సమేత రెండూ ఆరంభ శూరత్వం చూపించి తర్వాత లాస్‌ వెంఛర్లుగానే మిగిలాయి. జిగేలు రాణిగా ఐటెమ్‌ సాంగ్‌ చేసిన రంగస్థలం తప్ప తనకంటూ ఇంకా హిట్‌ రాలేదు. ప్రస్తుతం మహేష్‌తో మహర్షి చిత్రంలో నటిస్తోన్న పూజ ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో లీడింగ్‌లో వుంది. కానీ ఎంత డిమాండ్‌ వున్నా సక్సెస్‌ వస్తే తప్ప ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలుపుకోలేదు.

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల అరవింద సమేత కూడా కమర్షియల్‌గా ఫెయిలవడంతో పూజని అప్పుడే మీడియా దురదృష్టం అంటూ బ్రాండ్‌ చేసేయడం స్టార్ట్‌ చేసింది. మరి ఈ మచ్చని మహర్షి అయినా తుడిచేసి తదుపరి నంబర్‌వన్‌ హీరోయిన్‌ కావడానికి మార్గం సుగమం చేస్తుందా లేదా అనేది చూడాలి. వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేస్తోన్న మహర్షి వచ్చే యేడాది ఏప్రిల్‌ 5న విడుదలకి సిద్ధమవుతోంది.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?