Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుకున్నది సాధించిన అమీర్ ఖాన్

అనుకున్నది సాధించిన అమీర్ ఖాన్

అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ వీకెండ్ గడిస్తే ఈ సినిమాకు వసూళ్లు రావడం దాదాపు కష్టమని తేలిపోయింది. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా తను అనుకున్నది సాధించాడు అమీర్ ఖాన్. తొలిరోజు వసూళ్లలో బాహుబలి-ది కంక్లూజన్ సినిమాను అధిగమించాడు.

ఫస్ట్ డే వసూళ్లలో ఇండియాలో మొన్నటివరకు బాహుబలి-2 సినిమాదే హవా. దాదాపు 5వేల స్క్రీన్స్ పై విడుదలైన ఈ సినిమా తొలిరోజు 40 కోట్ల 73 లక్షల రూపాయల నెట్ సాధించింది. ఇప్పుడీ సినిమా రికార్డును అమీర్ ఖాన్ బద్దలుకొట్టాడు. మొదటిరోజు అత్యథిక వసూళ్లు సాధించిన హీరోగా అవతరించాడు. 6వేలకు పైగా స్క్రీన్స్ పై విడుదలైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాకు మొదటిరోజు ఏకంగా 52 కోట్ల 25 లక్షల రూపాయల నెట్ వచ్చింది.

విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్ భారీస్థాయిలో జరిగింది. పైగా స్క్రీన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో లాక్ చేయడంతో తొలిరోజు అత్యథిక వసూళ్లు సాధించిన హీరోగా అవతరించాడు అమీర్ ఖాన్. సో.. ఇండియాలో ఫస్ట్ డే వసూళ్లలో ఇప్పుడు మొదటి స్థానంలో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ నిలవగా, రెండో స్థానంలో బాహుబలి-2, మూడో స్థానంలో సల్మాన్ నటించిన ప్రేమ్ రథన్ ధన్ పాయో సినిమాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతానికి అమీర్ ఖాన్ కు ఇదొక్కటే ఆనందం. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా వీకెండ్ గడిచేసరికి ఇంకేదైనా మరో రికార్డు దక్కే ఛాన్స్ ఉంది. అంతకుమించి ఈ సినిమా సాధించేదేం ఉండకపోవచ్చు. ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే.. ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లంతా దాదాపు నష్టాలు చవిచూడాల్సిందే. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు ఏ స్థాయిలో నష్టపోయారో.. దానికి రెండింతలు నష్టం ఈ సినిమాకు రావొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?